నితిన్ వద్దనుకున్న కథలు.. ఇప్పుడు ఇతర హీరోలకు గోల్డెన్ ఛాన్స్!
తాజాగా సందీప్ కిషన్ నటించిన ‘పవర్ పేట’ టీజర్ విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే ఈ కథను దర్శకుడు కృష్ణ చైతన్య తొలుత నితిన్ కోసమే రాసుకున్నారు. నితిన్ కూడా దీనిపై ఆసక్తి చూపించారు కానీ, కృష్ణ చైతన్య గత చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ కాంబో పట్టాలెక్కలేదు.‘పవర్ పేట’ టీజర్ చూస్తుంటే అందులో రా మాస్ ఎలిమెంట్స్, నెగటివ్ షేడ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. నితిన్ ఇమేజ్‌కు ఇలాంటి ఓవర్ మాస్ పాత్రలు అంతగా సెట్ కావు. అదే సందీప్ కిషన్ విషయానికి వస్తే, ఆయన ‘ప్రస్థానం’ నుండి ‘రాయన్’ వరకు ఇలాంటి డార్క్ షేడ్స్ ఉన్న పాత్రలను అద్భుతంగా పండించారు. కాబట్టి, ఈ ప్రాజెక్ట్ సందీప్ దగ్గరికి వెళ్లడం ఒక రకంగా నితిన్‌కు మంచే చేసిందని చెప్పాలి.
ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ కూడా మొదట నితిన్ వద్దకే వెళ్ళింది. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి గారు ఈ సినిమాను సొంత బ్యానర్‌లో నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. కానీ ఏమైందో ఏమో ఈ ప్రాజెక్ట్ ఆనంద్ దేవరకొండ చేతుల్లోకి వెళ్ళింది.ఈ సినిమా యుకె (UK) బ్యాక్‌డ్రాప్‌లో సాగే కాలేజీ డ్రామా. ఇందులో లిప్ లాక్స్, యూత్ ఫుల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయట. ప్రస్తుతం నలభై ఏళ్ల వయసులో ఉన్న నితిన్‌కు కాలేజీ కుర్రాడి పాత్రలో అలాంటి బోల్డ్ సీన్స్ చేయడం అంతగా సెట్ అవ్వదు. ఆనంద్ దేవరకొండ వంటి కుర్ర హీరోలకు ఈ పాత్ర పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది.
దర్శకుడు వేణు యెల్దండి (బలగం ఫేమ్) దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ‘ఎల్లమ్మ’ అనే సినిమా నితిన్ చేయాల్సి ఉంది. అంతా ఓకే అనుకున్న తరుణంలో నితిన్ నటించిన ‘తమ్ముడు’ సినిమా రిజల్ట్ ఈ కాంబోపై ప్రభావం చూపింది. అనూహ్యంగా నితిన్ ప్లేస్‌లోకి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇచ్చి అందరినీ షాక్‌కు గురిచేశారు. ‘ఎల్లమ్మ’ గెటప్‌లో దేవీశ్రీ ప్రసాద్‌ను చూశాక, ఇలాంటి విలక్షణమైన పాత్రలకు కొత్త వాళ్ళు లేదా ఇమేజ్ చట్రంలో లేని వాళ్ళు అయితేనే న్యాయం జరుగుతుందనే అభిప్రాయం బలపడింది. స్టార్ ఇమేజ్ ఉన్న నితిన్ ఇలాంటి ప్రయోగాలు చేయడం రిస్క్ అనిపించవచ్చు.