ఏపీ: వారందరికీ గుడ్ న్యూస్.. కుటుంబానికి రూ.20 వేలు..!

Divya
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే తల్లికి వందనం, పింఛన్ పెంపు, రైతు భరోసా పెంపు వంటి వాటిని అమలు చేసింది. ఇప్పుడు తాజాగా మత్స్యకారుల సేవ పథకం కింద డబ్బులను జమ చేయబోతున్నారు. రూ. 262 కోట్ల రూపాయలు జమ చేయబోతున్నారు. మంగళవారం రోజున ఉదయం 10:45 నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మల పేటలో ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు మాట్లాడిన తర్వాత మత్స్యకార కుటుంబాలతో ముఖాముఖిలో పాల్గొని డబ్బులను మత్స్యకారుల ఖాతాలో వేయనున్నారు.


 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్య సంపదను పెంచేందుకు ప్రతి ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు (61) రోజులపాటు సముద్రంలో వేట నిషేధించడం తెలిసిందే.. ఈ సమయంలో వీరికి ఆదాయం ఉండదు కనుక, ఈ సమయంలో మత్స్యకారుల జీవనోపాధి కోసం కూటమి ప్రభుత్వం వారి కుటుంబాలకు రూ .20వేల రూపాయలు చొప్పున అందిస్తోంది. గత వైసిపి ప్రభుత్వం ఏడాదికి రూ.10 వేలు ఇవ్వగా ఇప్పుడు రెండేళ్లలోనే మత్స్యకారుల కుటుంబాలు కూడా పెరిగాయి. దీంతో రూ.500 కోట్ల రూపాయలకు పైగా విడుదల చేయబోతున్నారు.



మత్స్యకారుల సేవ పథకం ద్వారా ఈ డబ్బులను మత్స్యకారుల ఖాతాలో జమ చేయనున్నారు. మొత్తం 1,30,796  మత్స్యకారుల కుటుంబాలకు  రూ.20 వేల రూపాయల చొప్పున జమ చేయబోతోంది ఏపీ ప్రభుత్వం. ఈ పథకం ద్వారా డబ్బులు పొందాలంటే ఈ కేవైసీ పూర్తి చేయాలని నిబంధన విధించింది. దీంతో ఈ కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ డబ్బులు జమ చేస్తోంది. ఇప్పటివరకు కేవలం 90 శాతం మంది మాత్రమే ఈ కేవైసీ పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఈకేవైసీ పూర్తి కాకపోతే  వారి ఖాతా లో డబ్బులు జమా కావని ప్రభుత్వం చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: