బాలయ్య సినిమాలో ఆ స్టార్..పద్నాలుగేళ్ల తర్వాత మరోసారి ఆసక్తికర కాంబినేషన్..!
ఇక మనోజ్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపిస్తాడు అన్నదే ఇప్పుడు అందరిలోనూ పెద్ద ప్రశ్నగా మారింది. గోపీచంద్ మలినేని సినిమాల్లో పాత్రలకు ప్రత్యేకమైన బలం ఉండటం తెలిసిందే. అందుకే మనోజ్ కోసం కూడా ఓ పవర్‌ఫుల్ రోల్ డిజైన్ చేసినట్టు సమాచారం. యాక్షన్, ఎమోషన్ కలగలిపిన ఈ పాత్ర సినిమాలో కీలక మలుపు తిప్పనుందని టాక్ వినిపిస్తోంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. దాదాపు పద్నాలుగేళ్ల క్రితం విడుదలైన ఊ కొడతారా? ఉలిక్కి పడతారా? సినిమాలో బాలకృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించారు. కామెడీ హారర్ నేపథ్యంలో వచ్చిన ఆ చిత్రంలో బాలయ్య చేసిన గెస్ట్ రోల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు బాలయ్య సినిమాలో మంచు మనోజ్ నటించనున్నాడు. దీంతో ఈసారి ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
ఇక ఈ భారీ చిత్రానికి సంగీత దర్శకుడు తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలయ్య సినిమాలకు థమన్ ఇచ్చిన మాస్ బీజీఎమ్ ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందువల్ల ఈ సినిమాకి కూడా సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మొత్తానికి బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబినేషన్‌కు ఇప్పుడు మంచు మనోజ్ చేరడం సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మాస్ యాక్షన్, పవర్‌ఫుల్ పాత్రలు, థమన్ సంగీతం కలిసొచ్చే ఈ చిత్రం బాలయ్య కెరీర్‌లో మరో బిగ్ హిట్‌గా నిలుస్తుందేమో చూడాలి.