మాస్ స్టెప్పులతో ఇరగదీసిన రామ్ చరణ్ , శృతి.. స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్!
ఇకపోతే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉందని ఎప్పుడైతే ప్రకటించారో ఇక అప్పటినుంచి అభిమానులలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇందులో ఎవరు నటించబోతున్నారు అనే కామెంట్లు కూడా వ్యక్తమయ్యాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హెల్లల్ల అంటూ త్వరలో విడుదల చేయబోతున్న స్పెషల్ సాంగుకు సంబంధించిన ప్రోమోని మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఇందులో రామ్ చరణ్ తో పాటు స్టార్ బ్యూటీ శృతిహాసన్ కనిపించడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ పాట ట్రెండింగ్ లోకి వచ్చేసింది.
ముఖ్యంగా వీరిద్దరి డాన్స్ మూవ్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. మాస్ బీట్ కి తగ్గట్టుగా వేసిన స్టెప్పులు పాటపై అంచనాలను పెంచేసాయి . కంప్లీట్ సాంగ్ మార్చి 23వ తేదీన విడుదల కానుండగా.. రేపు భోపాల్లో నిర్వహించనున్న భారీ మ్యూజికల్ ఈవెంట్లో ఈ పాటను రిలీజ్ చేయబోతున్నారు. ఈ పాటకి ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. ఏ ఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు ..ఏది ఏమైనా ఈ పాట ఇప్పుడు అటు సోషల్ మీడియాలో కూడా అప్పుడే వైరల్ గా మారుతోంది.