మెగా ఫ్యాన్స్ చిరకాల కోరిక నెరవేర్చబోతున్న బాబీ..ఇక కెవ్వు కేకే..!
ఇక ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ రావడం వెనుక ఓ ఆసక్తికరమైన కారణం ఉందనే వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా ఒక కీలక పాత్రను డిజైన్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ పాత్ర స్క్రీన్‌పై కేవలం కొన్ని నిమిషాలే కనిపించినా కథలో చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆ పాత్ర సినిమా ఎమోషనల్ హై పాయింట్‌గా నిలుస్తుందనే ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే దర్శకుడు బాబీ, చిరంజీవితో తెరకెక్కించిన వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ కోసం ప్రత్యేక పాత్రను సృష్టించి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన అందుకున్నాడు. రవితేజ ఎంట్రీ సినిమాకు అదనపు ఎనర్జీ తీసుకొచ్చిందనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. అదే తరహాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ను కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం చేయాలని బాబీ ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే ఈ విషయంపై మూవీ టీమ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ మెగా అభిమానులు మాత్రం ఈ వార్త నిజమైతే థియేటర్లలో భారీ సంబరాలు ఖాయమని భావిస్తున్నారు. చిరంజీవి – పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌ను ఒకే సినిమాలో చూడాలనే కోరిక అభిమానుల్లో చాలా కాలంగా ఉంది. అందుకే ఇప్పుడు వస్తున్న ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.
ఇక ‘మెగా 158’ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంశాలతో ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, కథా నేపథ్యం, రిలీజ్ డేట్ వంటి వివరాలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.