పుష్ప: మంగళం శ్రీను పాత్ర వెనుక ఇంత కథ ఉందా..?
సునీల్ పుష్ప సినిమాలో మంగళం శ్రీను పాత్రలో అద్భుతంగా నటించారు. ఆ క్యారెక్టర్ లో సునీల్ ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఒక కామెడీయన్ని సుకుమార్ ఇంత పవర్ఫుల్ విలన్ గా ఎలా చూపించారు అనే ప్రశ్న మొదలైంది. ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చారు సునీల్.. లాక్ డౌన్ సమయంలో ఒకరోజు తాను డైరెక్టర్ సుకుమార్ తో మాట్లాడుతున్నానని, మాట మాటలో నేను కేవలం కామెడీ పాత్రలే కాకుండా తనలోని నటుడిని నిరూపించే వేరే వైవిధ్యమైన క్యారెక్టర్లో కూడా చేయాలని ఉందని చెప్పాను, అలా చెప్పిన రెండు రోజులకే సుకుమార్ దగ్గర నుంచి తనకు కాల్ వచ్చిందని తెలిపారు.
పుష్ప సినిమాలో మెయిన్ విలన్ క్యారెక్టర్ నిన్ను అనుకుంటున్నాను, కానీ అందులో ఒక కండిషన్ ఆ పాత్రలో అసలు కామెడీ చేయకూడదు కనీసం నీ బాడీ కూడా ఎక్కువగా మూవ్ కాకూడదని సుకుమార్ చెప్పారని, కేవలం కళ్ళు ముఖంలో మాత్రమే విలనిజం పలకాలని తెలిపారట. ఆ క్యారెక్టర్ వినగానే తాను పెద్ద షాక్ లో ఉన్నాను ఆ తర్వాత లుక్ టెస్ట్ కోసం కాస్ట్యూమ్స్ కూడా పంపితే ఒక్కో డ్రస్సు వేసుకొని ఫోటోలు దిగి మరి పంపించాను అలా మంగళం శ్రీను క్యారెక్టర్ కి సెలక్ట్ అయ్యాను అంటూ తెలిపారు సునీల్. అంతేకాకుండా షూటింగ్ సమయాలలో తల ముందు భాగం షేవ్ చేసుకునేవాడిని అంటూ తెలిపారు.