అలాంటి వ్యాధితో బాధపడుతున్న కోలీవుడ్ హీరో..!

Divya
 కోలీవుడ్లో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు సంపాదించారు హీరో విష్ణు విశాల్. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ హీరో బాగా సుపరిచితమే. అతను నటించిన ఎన్నో చిత్రాలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యి బాగానే పేరు సంపాదించాయి. ఎఫ్ఐఆర్, గట్ట కుస్తీ, ఆర్యన్, లాల్ సలామ్ తదితర చిత్రాలలో నటించారు. ప్రస్తుతం గట్ట కుస్తీ2 సినిమాలో నటిస్తూ ఉన్నారు. గత కొద్ది రోజులుగా తన మీద పలు రకాల రూమర్స్ వినిపిస్తున్న తరుణంలో తన ఆరోగ్యం విషయంలో వస్తున్న వదంతుల పైన తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఒక నోట్ విడుదల చేశారు.


విష్ణు విశాల్ ఇలా రాసుకోస్తు.. అందరికీ హాయ్, మీ కామెంట్స్ మెసేజ్లు ద్వారా చూపించిన ప్రేమకు శ్రద్ధకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నాకు ఇది చాలా విలువైనది ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకున్నాను.. ముఖ్యంగా తన ముఖం ఎప్పుడూ కూడా అలసిపోయినట్లుగా కనిపిస్తోంది. ఇందుకు గల కారణం ఏమిటంటే నేను గత రెండు మూడు సంవత్సరాలుగా ఆటో ఇమ్యూన్ వ్యాధితో  బాధపడుతున్నానని, అందుకోసం చికిత్స తీసుకుంటున్నానని.. వైద్యుల సలహా మేరకు కొన్ని మందులు సూచించారు. వాటిని తీసుకున్నందుకే తాను అలా మారిపోయానని ఈ మందులు తీసుకుంటున్నప్పుడు తనకి కడుపు ఉబ్బరంగా ఉండడమే కాకుండా బాడీలో కొన్ని మార్పులు కూడా కనిపిస్తాయని, ముందుగా తన ఆరోగ్యానికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి అందుకే వైద్యులు చెప్పినట్టుగానే చికిత్స తీసుకుంటున్నారని ఈ క్లిష్ట సమయంలో మి ప్రేమ అభిమానం నన్ను ముందుకు నడిపిస్తాయని రాసుకొచ్చారు.



జులై మూడవ తేదీన గట్ట కుస్తీ2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకి మీ ప్రేమ మద్దతు ఉంటుందని ఎదురుచూస్తున్నానని రాసుకొచ్చారు విష్ణు విశాల్. దీంతో ఈ విషయం విన్న అభిమానులు నటిజెన్స్ సైతం హీరోకు జాగ్రత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: