అలాంటి వ్యాధితో బాధపడుతున్న సింగర్ సునీత..!

Divya
తెలుగు సినీ పరిశ్రమలో తన పాటలతోనే కాకుండా,డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా అందరిని ఆకట్టుకుంది స్టార్ సింగర్ సునీత. అతి చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వేలాది పాటలు పాడింది.అంతేకాకుండా తన రెండో వివాహ విషయంలో కూడా ఈమె పేరు ఎక్కువగా వినిపించింది. ప్రస్తుతం సినిమాలలో పాటలు పాడుతూనే పలు రకాల ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ అలాగే కొన్ని ఈవెంట్స్ కి జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీత తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను బయటపెట్టింది. ముఖ్యంగా తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ తను ఒక వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లు తెలియజేసింది.


సింగర్ సునీత మాట్లాడుతూ తాను గత కొన్నేళ్లుగా "క్రాన్స్" అనే వ్యాధితో బాధపడుతున్నానని తెలియజేసింది. ఇది తన జీవితంలో జరిగిన కొన్ని పర్సనల్ సమస్యలు వ్యక్తిగత ఇబ్బందుల వల్లే వచ్చిందని, తాను డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని ఆ బాధ అంతా కూడా తనలో దాచుకోవడం వల్లే ఆటో ఇమ్యూన్ డిసిజ్ వచ్చిందని తెలియజేసింది. ఇప్పటికీ కూడా తాను ఈ వ్యాధితో ఫైట్ చేస్తున్నానని, ఏదైనా ఒత్తిడి పెరిగిన శరీరమంతా కూడా చాలా నొప్పులు వస్తాయంటూ తెలియజేసింది సింగర్ సునీత.

 అలాగే ఇండస్ట్రీలో మహిళల పైన జరుగుతున్న వేధింపుల గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడింది. సినీ పరిశ్రమలో వేధింపులు జరుగుతాయి అనేది కూడా అక్షరాల నిజమని అయితే అది ఇప్పటికీ గుర్తింపు సంపాదించుకున్న వారి కంటే కొత్తగా ఇండస్ట్రీలో అవకాశాల కోసం వచ్చే అమ్మాయిల విషయంలోనే ఇవి ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. తాను 18 ఏళ్ల వయసులోనే ఇలాంటి చేదు అనుభవాలను కూడా ఎదుర్కొన్నానని తెలియజేసింది.. అలాగే ఇండస్ట్రీలో వచ్చే వారికి ఫైనాన్షియల్ గా, మెంటల్గా , ఎమోషనల్ గా ఫిజికల్ గా అన్నిటికీ స్ట్రాంగ్ గా ఉండాలని అప్పుడే వారు ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలరు అంటూ తెలియజేసింది సునీత.
సింగర్ సునీతకు ఇద్దరు పిల్లలు, 2020లో ఈమె రామ్ వీరపనేని రెండో వివాహం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: