* ప్రేక్ష‌కుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగిన‌ ‘ఏ దేవి వ‌ర‌మో నీవు’ గ్రాండ్ ప్రీమియ‌ర్ లాంచ్ ఈవెంట్‌.. ‘స్టార్ మా’లో జూలై 6 నుంచి స్ట్రీమింగ్*

Reddy P Rajasekhar

వైవిధ్య‌మైన కంటెంట్‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని ద‌క్కించుకున్న ఛానెల్ స్టార్ మా ఇప్పుడు మ‌రో వైవిధ్య‌మైన సీరియ‌ల్ ‘ఏ దేవి వ‌ర‌మో నీవు’ జూలై 6 నుంచి ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టానికి సిద్ధ‌మైంది. ఈ సీరియ‌ల్ గ్రాండ్ ప్రీమియ‌ర్ లాంచ్ ఈవెంట్‌ను ఆల్వాల్‌లోని వీబీఆర్ గార్డెన్స్‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ‘గుండె నిండా గుడిగంట‌లు’ సీరియ‌ల్ హీరో బాలు ముఖ్య అతిథిగా విచ్చేశారు. సీరియ‌ల్‌లో ముఖ్య పాత్ర‌ధారులైన‌ సంజ‌నా గ‌ల్రాని, సోనియా, శ్ర‌వ‌ణ్‌లు హాజ‌ర‌య్యారు. ఎక్స్‌ప్రెస్ హ‌రి ఈవెంట్‌ను హోస్ట్ చేశారు. ఈవెంట్‌కు భారీ సంఖ్య‌లో అభిమానులు త‌ర‌లి వ‌చ్చారు. కార్య‌క్ర‌మంలో భాగంగా మొద‌ట‌టి ఎపిసోడ్‌ను సైతం ప్రేక్ష‌కుల కోసం ప్ర‌ద‌ర్శించారు.

ఏ దేవి వ‌ర‌మో నీవు’ సీరియ‌ల్‌లోని ఎమోష‌న్స్‌కు, న‌టీన‌టుల పనితీరుకి ఆడియెన్స్ నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. సీరియ‌ల్ విష‌యానికి వ‌స్తే.. ప్రేమికుడు మోసం చేసిన గీతాంజ‌లి ఓ పాప‌కు జ‌న్మ‌నిస్తుంది. కానీ ఆమె తండ్రి, అన్న‌య్య ఆ పాప‌ను త‌మ వార‌సురాలిగా అంగీక‌రించ‌రు. దాంతో ఆమెను ఓ అనాథ ఆశ్ర‌మంలో వ‌దిలేస్తారు. అక్క‌డే అంజ‌లి పేరుతో పెరిగి పెద్ద‌యిన ఆ పాప‌.. అనుకోని ప‌రిస్థితుల్లో త‌న త‌ల్లి చెంత‌కే చేరుకోవాల్సి వ‌స్తుంది. ఇంత‌కీ గీతాంజ‌లి త‌న కూతురు అంజ‌లిని గుర్తు ప‌డుతుందా? త‌ల్లి ప్రేమ‌కు ప‌రిత‌పించే అంజ‌లికి అమ్మ ఆప్యాయ‌త ద‌క్కుతుందా? అనే విష‌యాలు తెలియాలంటే మాత్రం ‘ఏ దేవి వ‌ర‌మో నీవు’ సీరియ‌ల్‌ను చూడాల్సిందే. ఈ సీరియ‌ల్ ప్ర‌తి సోమ‌వారం నుంచి శ‌నివారం రాత్రి 8 గంట‌ల 30 నిమిషాల‌కు స్టార్ మా ఛానెల్‌లో ప్ర‌సార‌మ‌వుతుంది. ఇంత‌కీ గీతాంజ‌లి త‌న కూతురు అంజ‌లిని గుర్తు ప‌డుతుందా? త‌ల్లి ప్రేమ‌కు ప‌రిత‌పించే అంజ‌లికి అమ్మ ఆప్యాయ‌త ద‌క్కుతుందా? అనే విష‌యాలు తెలియాలంటే మాత్రం ‘ఏ దేవి వ‌ర‌మో నీవు’ సీరియ‌ల్‌ను చూడాల్సిందే. ఈ సీరియ‌ల్ ప్ర‌తి సోమ‌వారం నుంచి శ‌నివారం రాత్రి 8 గంట‌ల 30 నిమిషాల‌కు స్టార్ మా ఛానెల్‌లో ప్ర‌సార‌మ‌వుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: