వి.వి. వినాయక్ చేతుల మీదుగా 'వెంకట్రామయ్య గారి తాలుకా' చిత్రంలోని మూడో పాట 'అడుకున్న దిక్కడే' లిరికల్ సాంగ్ విడుదల
కుటుంబ బంధాలు, మానవ సంబంధాల విలువలను హృద్యంగా ఆవిష్కరిస్తూ రూపొందుతున్న వెంకట్రామయ్య గారి తాలుకా ఈ చిత్రం ఈనెల 17 న ప్రేక్షకుల ముందుకి రానుంది. ప్రమోషన్ లో భాగంగా ఈ చిత్రం నుంచి మూడో గీతం ఆడుకున్న దిక్కడే లిరికల్ సాంగ్‌ను స్టార్ దర్శకుడు వి.వి. వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సినిమా మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ, "ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పుడు విడుదల చేసిన ఆడుకున్న దిక్కడే పాట కూడా ప్రతి ఒక్కరిని హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. కథలోని భావోద్వేగాలను ప్రతిబింబించే ఈ గీతం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది" అని తెలిపారు.
హీరో దినేష్ కుమార్ హీరోయిన్‌గా పరిచయమవుతున్న దివిజ ప్రభాకర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సతీష్ ఆవాల దర్శకత్వం వహిస్తున్నారు. కోమలి క్రియేషన్స్ పతాకంపై కోమలి మహేందర్ తొట్టె సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కుటుంబ అనుబంధాలు, తల్లిదండ్రుల ప్రేమ, భావోద్వేగాలతో నిండిన ఈ చిత్రం జులై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రానికి సంగీతం ఒక ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్ర యూనిట్ ప్రత్యేకంగా పేర్కొంది. గ్రామీణ నేపథ్యం, స్వచ్ఛమైన భావోద్వేగాలతో సాగే ఈ కథలో ప్రతి పాత్ర ప్రేక్షకుడికి తమ సొంత ఇంటి మనుషులను గుర్తుచేస్తుందని దర్శకుడు సతీష్ ఆవాల ధీమా వ్యక్తం చేశారు. నూతన నటీనటులైన దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్ తమ నటనతో మెప్పించడమే కాకుండా, సీనియర్ నటీనటుల నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని నిర్మాతలు తెలిపారు. జులై 17న విడుదలవుతున్న ఈ చిత్రం ఖచ్చితంగా ప్రతి కుటుంబం కలిసి చూడదగ్గ ఒక మంచి అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేసింది.