శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ‘ముగ్గురు కోతులు’ టైటిల్ సాంగ్ రిలీజ్

Reddy P Rajasekhar

జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో  శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ముగ్గురు కోతులు’. ఈ మూవీలో తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ముఖ్య పాత్రల్ని పోషిస్తుండగా.. వర్షిక పాశం హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి రీసెంట్‌గా టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.

‘ముగ్గురు కోతులు’ అంటూ సాగిన ఈ వీడియో సాంగ్‌‌లో ముగ్గురు హీరోలు ఫుల్ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు. బ్యాచిలర్, సింగిల్ లైఫ్‌లు ఎలా ఉంటాయో ఈ వీడియో సాంగ్‌లో కనిపిస్తుంది. యూత్ ఫుల్ ఫన్ ఓరియెంటెడ్‌గా సినిమా రానుందని ఈ పాటను చూస్తేనే అర్థం అవుతోంది. క్యాచీ ట్యూన్‌కి, హీరోలు చేసే అల్లరి పనులకు ఆడియెన్స్ ఫిదా అయ్యేలా కనిపిస్తున్నారు. ఇక ఈ పాటకు జగదీష్ బుసయవలస సాహిత్యం, చైతన్య గన్నవరపు గాత్రం ప్రధాన ఆకర్షణగా నిలిచేలా ఉంది.

ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకి ఎస్. సుహాస్ సంగీతాన్ని అందిస్తున్నారు.  ఈ మూవీకి రాజ్ నోముల కెమెరామెన్‌గా, జమీర్ షేక్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. మున్ముందు మరిన్ని అప్డేట్‌లతో ఆడియెన్స్‌ని అలరిచేందుకు టీం రెడీగా ఉంది.


ప్రస్తుత యువత ఆలోచనలు, వారి జీవనశైలి, ఫ్రెండ్‌షిప్‌ నేపథ్యంలో పూర్తిస్థాయి కామెడీ అండ్ ఎంటర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. విడుదలైన కొద్దిసేపటికే ఈ 'టైటిల్ సాంగ్' సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ, ముఖ్యంగా కుర్రకారును ఆకట్టుకుంటోంది.


 నటీనటులు : తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్, వర్షిక పాశం తదితరులు

 సాంకేతిక బృందం

సమర్పణ : జీఎస్ఆర్ క్రియేషన్స్
సహ సమర్పణ : స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్
నిర్మాత :శోభారాణి గరిమెల్ల
దర్శకుడు :కార్తీక్ గరిమెల్ల
కెమెరా :రాజ్ నోముల
సంగీతం :ఎస్. సుహాస్
ఎడిటింగ్ :జమీర్ షేక్
పీఆర్వో :  సాయి సతీష్


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: