అక్టోబర్ 2న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోన్న ‘అనకాపల్లి’ చిత్రం

Reddy P Rajasekhar

భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్  బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నటిస్తూ, నిర్మించిన రా అండ్ రస్టిక్‌ చిత్రం ‘అనకాపల్లి’. ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు.  కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా చేసిన ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లేని అందించారు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్‌లు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. ఇక ఆగస్ట్ నెలలోనే ఈ మూవీని అనకాపల్లి ప్రజలకు ప్రత్యేకంగా ప్రదర్శించారు.

‘అనకాపల్లి’ సినిమాని అనకాపల్లి ప్రజలు వీక్షించి అద్భుతమైన రెస్సాన్స్‌ను అందించారు. ఈ మూవీని తెలుగులో పాటుగా తమిళంలోనూ భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోన్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రధాన పాత్రల్ని చూపిస్తూ వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ఇప్పుడు అందరిలోనూ మరింత ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తోంది.

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్‌పి, పూర్వి డిస్ట్రిబ్యూషన్స్ సంస్థలు కలిసి ఈ సినిమాని అక్టోబర్ 2న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నాయి. ఈ చిత్రానికి మాయా.వి కెమెరామెన్‌గా, శ్రీకృష్ణ అట్టలూరి ఎడిటర్‌గా పని చేశారు. త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి ఉదయ్ భాగవతులు డైలాగ్ రైటర్‌గా వర్క్ చేశారు.

 తారాగణం : విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప, త్రినాధ రావు నక్కిన, ఇంద్రజ అబ్సర్, మహబూబ్ బాషా, శ్రీనివాస్ వడ్లమాని, కాండ్రేగుల నాయుడు, నందిని రాయ్, సంగీత క్రిష్ తదితరులు

 సాంకేతిక సిబ్బంది:

బ్యానర్: భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్
నిర్మాతలు: కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన
సహ నిర్మాత: కాండ్రేగుల కుమార్ రాజా
కథ & స్క్రీన్‌ప్లే: త్రినాధరావు నక్కిన
దర్శకుడు: ఖగేష్ తమ్మినేని
డీ ఓ పి : మాయా. వి
సంగీతం: దేవ్ జండ్
ఎడిటర్: శ్రీకృష్ణ అట్టలూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సెట్రామరాజు మల్లెల
సంభాషణలు: ఉదయ్ భాగవతుల
ప్రొడక్షన్ డిజైనర్: రఘు కులకర్ణి
కొరియోగ్రఫీ: శేఖర్ VJ, యష్ మాస్టర్, జిత్తు మాస్టర్
కాస్ట్యూమ్ డిజైనర్: సూర్య కొయ్య
సాహిత్యం: అనంత శ్రీరామ్, కెకె, గణేష్ సలాది, రాంబాబు గోశాల, తేజ గొర్లె
అదనపు పాటలు: వి.కిరణ్ కుమార
కో-డైరెక్టర్: రమేష్ బాబు యేపాటి
సౌండ్ ఎఫెక్ట్స్: హేమంత్
డి ఐ : రెడ్ ఓచర్
రంగు: ఎం. రాజు రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: NVSS సురేష్
ప్రొడక్షన్ కంట్రోలర్: చందు దేశెట్టి
పీఆర్ఓ : సాయి సతీష్
మార్కెటింగ్: స్టార్ సర్కిల్

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: