బాలల దినోత్సవం సందర్భంగా ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ నవంబర్ 14న విడుదల కాబోతోంది, పిల్లల కోసం టికెట్ రేట్లు రూ.250 నుంచి రూ.150 తగ్గింపు - నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి
నమో జయం ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మాణంలో జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన తెరకెక్కించిన చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్’. ఈ సినిమాలో మాస్టర్ జయంత్ బొలిశెట్టి, మన శంకర వర ప్రసాద్ ఫేమ్ ఊహా రెడ్డి, సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. బాలల దినోత్సవం సందర్భంగా ఈ మూవీని నవంబర్ 14న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో
ట్యూన్స్ & లిరిసిస్ట్ ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రంలో నేను రాసిన పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ మూవీని బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న రిలీజ్ చేస్తున్నాం. పిల్లలు, పేరెంట్స్, టీచర్స్ అందరూ కలిసి తండోపతండాలుగా థియేటర్లు బుక్ చేసుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా మా చిత్రం ఉంటుంది’ అని అన్నారు.
మాస్టర్ జయంత్ బొలిశెట్టి మాట్లాడుతూ .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ సినిమాని చిల్డ్రెన్స్ డే స్పెషల్‌గా రిలీజ్ చేస్తున్నాం. పిల్లల కోసం ఈ మూవీ టికెట్‌ని రూ. 250 నుంచి రూ. 150కి తగ్గించాం. పిల్లలకు, పెద్దలకు, టీచర్లకు మంచి సందేశం ఇచ్చేలా సినిమా ఉంటుంది. మా మూవీ అందరికీ కనెక్ట్ అవుతుంది’ అని అన్నారు.
నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ సినిమాలోని ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి. పిల్లల కోసం టికెట్ రేట్లను తగ్గించాం. పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్స్ అందరూ ఈ మూవీని చూడాలి. బాలల దినోత్సవం సందర్భంగా మా సినిమా రిలీజ్ అవుతోంది. పిల్లల మార్కులు కాదు మనసులు చూడండి’ అని అన్నారు.
సహ నిర్మాత షఫి మాట్లాడుతూ .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రాన్ని బాలల దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేస్తున్నాం. పిల్లలకు కానుకగా ఈ మూవీని విడుదల చేస్తున్నాం. అందుకే రూ. 250 ఉన్న టికెట్‌ని రూ. 150కే అందిస్తున్నాం. అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. ఈ క్రమంలో వేరే వాళ్లు కూడా చిల్డ్రెన్స్ డే స్పెషల్ అని సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నారు. మేం మాత్రం ముందు నుంచే పిల్లల కోసం ఈ మూవీని తీశాం. అందరూ మా సినిమాని నవంబర్ 14న చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
దర్శకుడు నవీన్ దేశబోయిన మాట్లాడుతూ .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రాన్ని బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న రిలీజ్ చేస్తున్నాం. ఈ మూవీని వ్యాపారంగా చూడటం లేదు. అందుకే టికెట్ రేట్లను రూ. 150కి తగ్గించాం. పిల్లలు, పేరెంట్స్, టీచర్స్ అందరూ ఈ సినిమాని చూడాలి. ఇప్పటికే చాలా స్కూల్స్ థియేటర్లను బుక్ చేసుకున్నాయి. ఈ రోజు కావాలనే ఓ సినిమాని చిల్డ్రెన్స్ డే స్పెషల్ అంటూ ప్రమోట్ చేసుకుంటున్నారు. ఆ విషయంలో మీరు పొరబాటు పడకండి. మా ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ సినిమా నవంబర్ 14న రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.