"యాత్ర"కు మీడియా సపోర్ట్ లేనిది.. ఆ కులం కానందుకేనా..?

Chakravarthi Kalyan
యాత్ర.. అంతగా అంచనాలు లేకుండా వచ్చి ఆకట్టుకుంటోన్న సినిమా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా పేరు వచ్చినా.. వాస్తవానికి ఇది బయోపిక్ కాదు.. వైఎస్ పాదయాత్ర కథాంశంగా వచ్చిన సినిమా.. కేవలం ఓ ఎపిసోడ్ ను సినిమాగా మలచడం అంత సులభం కాకపోయినా దర్శకుడు మహి వి రాఘవన్ అందులో సక్సస్ అయ్యారు.



ఈ సినిమాకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. దీనికితోడు కలెక్షన్లు కూడా బావున్నాయి. అయితే ఈ సినిమాకు మీడియాలో రావలసినంత పబ్లిసిటీ మాత్రం రావడం లేదు. ప్రధాన మీడియా పత్రికలు ఈ సినిమా గురించి పెద్దగా పట్టించుకోనేలేదు.



తెలుగు మీడియా ఎక్కువగా ఒక సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తుందన్న విమర్శలు యాత్ర సినిమాతో మరోసారి నిరూపించినట్టయింది. ఇదే మీడియా బాహుబలి, ఎన్టీఆర్ కథానాయకుడు వంటి సినిమాలకు విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చింది. విడుదలకు ముందే హైప్ క్రియేట్ చేసింది.



యాత్ర సినిమా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితానికి సంబంధించింది కావడం వల్లే ఈ మీడియా నిరాదరణకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. యాత్రలో లీడ్ రోల్ సూపర్ స్టార్ మమ్ముట్టి పోషించినా కూడా అందుకు తగిన ప్రాధాన్యం మీడియాలో కనిపించలేదు. తమ సామాజిక వర్గానికి చెందిన సినిమాలను విపరీతంగా ప్రమోట్ చేయడం.. తమకు నచ్చని సినిమాలను పట్టించుకోకపోవడం అన్న మీడియా వివక్ష యాత్ర సాక్షిగా మరోసారి రుజువైందనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: