మహర్షి లేటెస్ట్ అప్డేట్ : దిల్ రాజు గట్స్ కి దండం పెట్టేసిన మహేశ్ బాబు
ముఖ్యంగా ‘మహర్షి’ సినిమా ఇంత తక్కువ టైమ్ లో రికార్డుల కలెక్షన్లు సాధించింది అంటే దానికి కారణం దిల్ రాజు అని ముఖ్యంగా టికెట్ల పెంపు విషయంలో దిల్ రాజు చూపించిన గట్స్ చాలా అభినందనీయం అంటూ మహేష్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ని పొగడ్తల వర్షం తో ముంచెత్తారు.
అంతేకాకుండా ఈ సినిమా కలెక్షన్ల గురించి ఇండస్ట్రీకి సంబంధించిన కొంత మంది వ్యక్తులు మాట్లాడుతూ నైజాంలో ఫస్ట టైమ్ మల్టీ ఫ్లెక్స్ ల రేట్లు పెంచుకొనేలా చేయగలిగిన ఘనత దిల్ రాజు ఖాతాలోనే పడుతుందని ఇందుమూలంగా టోటల్ కలెక్షన్ లో 25శాతం అదనంగా వచ్చిందని లెక్కలు చెబుతున్నారు. ఇలా చేయడం మిగిలిన వారికి సాధ్యంకాని పని అని కూడా అంటున్నారు. ఇలా తన 25వ సినిమా లో అన్నివిధాలా దిల్ రాజు వ్యవహారాలను దగ్గర నుంచి చూసిన మహేష్ బాబు ఇక ఆయనను వదలరని టాక్ వినిపిస్తోంది.