ఇన్నర్ దుస్తుల్లో సోనమ్ హాట్ అందాలు ..!
సోనమ్ కపూర్ సినిమా నేపధ్యం ఉన్న పెద్ద కుటుంబం నుంచి వచ్చింది. అయినా అందాలను ఆరబోయటంలో ఎక్కడ తగ్గడం లేదు. ఈ జెనరేషన్ భామల స్టైల్లోనే సోనమ్ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ పోస్ట్ చేస్తూ నెటిజనులతో.. ఫాలోయర్లతో టచ్ లో ఉంటుంది. తాజాగా సోనమ్ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు ఆమె "చోపార్డ్ కోసం #లానూట్ డెస్రోయిస్.
అబూ జాని సందీప్ ఖోస్లా డిన్నర్ పార్టీ" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. క్రీమ్ కలర్ డిజైనర్ డ్రెస్ లో పొడవాటి చున్ని లాంటి వస్త్రాన్ని అలంకరించుకుంది. మెడలో అదే రంగు మ్యాచింగ్ నెక్లెస్ ధరించింది. సేమ్ డిజైన్ లో ఉన్న డ్రెస్ తో బ్యాంగిల్ లాగా వేసుకుంది. ఈ దుస్తులకు నప్పే మేకప్ తో ఎంతో అందంగా కనిపించింది. ఇక ఈ డ్రెస్ స్లీవ్ లెస్ కావడంతో అందాల విందుకు ఏమాత్రం అడ్డంకి కాలేదు.
దీంతో నెటిజనులు కూడా రెచ్చిపోయి కామెంట్స్ పెట్టారు. ఒకరు "సోనమ్ ఈజ్ సో సెక్సీ" ఆని అన్నారు. మరొకరు "బ్యూటిఫుల్ బాంబ్" అన్నారు. ఇంకొకరు "హాటెస్ట్ బాలీవుడ్ బ్యూటీ" అన్నారు. మరో నెటిజన్ "ఈస్ట్ ఆర్ వెస్ట్ సోనమ్ ఈజ్ ది బెస్ట్" అన్నారు. ఇక సోనమ్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'ది జోయా ఫ్యాక్టర్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నాడు. అభిషేక్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జూన్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.