జగన్ నిర్ణయం తో ఊపిరిపీల్చుకున్న రోజా అభిమానులు..!
ఈ క్రమంలో మంత్రుల ఎంపికలో వరుసగా రెండుసార్లు చిత్తూరు జిల్లా నగరి నుండి గెలిచిన రోజా కి మంత్రి పదవి వస్తుందేమోనని అందరూ ఆశగా ఎదురుచూశారు. అంతేకాకుండా రోజాకు జగన్ హోంమంత్రి పదవి ఇవ్వబోతున్నారని కూడా అంచనా వేశారు. అన్ని అంచనాలు తప్పాయి. మంత్రుల జాబితాలో రోజా పేరు లేదు. రోజాకు జగన్ ఎలాంటి పదవి ఇవ్వలేదు. భవిష్యత్తులో మంత్రి వర్గ విస్తరణ చేస్తే రోజాకు అవకాశం ఉంటుందేమో.
ప్రస్తుతానికి ఆమె కేవలం ఎమ్మెల్యే మాత్రమే.రోజా సినీ సెలెబ్రిటీ కావడంతో మీడియాలో బాగా హైలైట్ అయ్యారు. ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలతో చెలరేగారు. ఈ క్రమంలోనే రోజాపై అంచనాలు పెరిగాయి. నగిరి నియోజకవర్గంలో తీవ్రమైన పోటీని అధికమించి రోజా రెండవసారి విజయం సాధించారు. రోజాకు మంత్రి పదవి ఖాయమని.. ఇక ఆమె జబర్దస్త్ షోకు దూరం కాక తప్పదని ఊహాగానాలు వినిపించాయి. గత కొన్నేళ్లుగా జబర్దస్త్ అంటే రోజా, నాగబాబు వెంటనే గుర్తుకు వచ్చే విధంగా వీరిద్దరూ పాపులర్ అయ్యారు. ఒక రకంగా జగన్ తీసుకున్న నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్నారు రోజా అభిమానులు.