దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. గ్లామర్ ఉండగానే డబ్బు సంపాదించుకోవాలి.. మార్కెట్ ఉండగానే బ్రాండ్ పెంచుకోవాలి... దీనిని మన తారలు భలేగా యూజ్ చేసుకుంటుంటారు. టాలీవుడ్ హీరోయిన్లలో ముఖ్యంగా కాజల్ దీనిని బాగా వంటపట్టించుకుంది.
అందుకే ఈ హీరోయిన్ వరసగా సినిమాలు చేస్తున్నా.. సినిమాల్లో వచ్చే సంపాదన కంటే ఫోటో షూట్ ల ద్వారా వచ్చే సంపాదనపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. ఎందుకంటే ఒక సినిమా చేస్తే కోటి వరకు తీసుకుంటోంది. అదే ఒక గ్లామరస్ ఫోటో షూట్ చేస్తే.. అంతకు మించి అనేలా సంపాదన.
అందుకే ప్రతి నాలుగైదు రోజులకు ఒకసారి హాట్ హాట్ ఫోటో షూట్ చేస్తూ.. సంపాదిస్తోంది. 15 సంవత్సరాల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ.. ఇప్పటికి ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నది. గతేడాది స్టార్ హీరోలతో సినిమాలు చేసిన కాజల్, ఇప్పుడు చిన్న హీరోలతో సినిమాలు చేస్తున్నది.