జబర్దస్త్ కు అనసూయ గుడ్ బై .. అసలు కారణం ఇదేనంటా ..!

Prathap Kaluva

అనసూయ ఉండటంతో జబర్దస్త్ షో మరో లెవెల్ కు చేరిందంటే అతిశయెక్తి కాదు. యాంకర్ అయినప్పటికీ తన అందాలతో బుల్లితెర ఆడియన్స్ ని మత్తెక్కించడంలో సక్సెస్ అయింది అనసూయ. దీంతో జబర్దస్త్ అంటే అనసూయ.. అనసూయ అంటే జబర్దస్త్ అనే స్టేజ్ కి వెళ్లిపోయారు స్మాల్ స్క్రీన్ ఆడియన్స్. అయితే అనసూయ గురించి తాజాగా వినిపిస్తున్న ఓ వార్త వారిని కలవర పెడుతోంది.


హాట్ యాంకర్ గా కొనసాగుతూనే వెండితెరపై కాలుమోపిన అనసూయ ఇక్కడ కూడా ఊహించని విజయం సాధించింది. వెండితెర ప్రేక్షకులు సైతం అనసూయ మాయలో పడిపోయారు. ఎలాంటి పాత్రలో నైనా ఇట్టే ఒదిగిపోతూ యమ అట్రాక్ట్ చేస్తోంది అనసూయ. ఇటీవలే రంగస్థలంలో రంగమ్మత్త గా అనసూయ అభినయం మెప్పించింది. దీంతో ఆమె డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టే పరిస్థితి నెలకొంది. 


ఈ నేపథ్యంలో అటు సినిమాలు, ఇటు జబర్దస్త్ మెయిన్‌టైన్ చేయాలంటే అనసూయకు డేట్స్ సర్దుబాటు కావడం లేదట. ఇన్ని రోజులు ఈ రెండు ట్రాక్స్ ఎలాగోలా నెట్టుకొచ్చినప్పటికీ ఇక జబర్దస్త్‌కి గుడ్ బై చెప్పాలనే ఆలోచనకు వచ్చిందట అనసూయ. ఈ విషయాన్ని అనసూయ తన సన్నిహితుల వద్ద ప్రస్తావించడంతో ఇలా బయటకు వచ్చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: