అమెరికా తానా సభలో సంచలన ప్రకటన చేసిన యాంకర్ అనసూయ…?
దీంతో వరుస అవకాశాలు ఇండస్ట్రీలో అనసూయా కి వస్తున్న క్రమంలో సినిమాలు చేస్తూనే మరో పక్క జబర్దస్త్ షోలలో యాంకరింగ్ చేస్తోంది. కెరీర్ జోరుగా సాగుతున్న సమయంలో అనసూయ తన సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం అనసూయ అమెరికాలో జరుగుతున్న తానా సభలకు హాజరైన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా తాను నిర్మాతగా మారబోతున్నట్లు అనసూయ ప్రకటించింది. కొత్త టాలెంట్ ని ప్రోత్సహించేందుకు తాను సినిమాలు నిర్మిస్తానని అనసూయ తెలిపింది. అనసూయ సినిమాలు నిర్మించే ఆలోచనని భవిష్యతులో అమలు చేస్తుందా లేక ప్రస్తుతం ఏదైనా ప్రాజెక్ట్ సిద్ధంగా ఉందా అనేది తెలియాల్సి ఉంది.