నిక్ తో ప్రియాంక చిందులేచిందులు...
ప్రియాంకా చోప్రా, నిక్ జొనాస్ ఇటలీలో విహరిస్తున్నారు. రెండు రోజుల క్రితం అక్కడికి వెళ్లిన వీరు విలువైన సమయాన్ని గడుపుతున్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోలు, ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. శనివారం రాత్రి వంట చేస్తున్న వీడియోలను పోస్ట్ చేసిన నిక్.. తర్వాత భార్యతో ఉన్న వీడియోను పంచుకున్నారు.
ఇందులో ప్రియ, నిక్ అందమైన ప్రకృతి మధ్య స్లో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియో అభిమానుల్ని ఆకట్టుకుంది. ప్రియాంక పెళ్లికి ముందు బాలీవుడ్లో ‘భారత్’ సినిమాకు సంతకం చేశారు. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఆమె ‘ది స్కై ఈజ్ పింక్’ సినిమాలో నటిస్తున్నారు.
దీనికి సోనాలీ బోస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫర్హాన్ అక్తర్, జైరా వాసిమ్ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబరులో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాస్త విరామం తీసుకున్న ప్రియాంక, నిక్ తో మస్తు మస్తుగా ఎంజాయ్ చేస్తోంది.
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా.. దాదాపు ఏడాదిపాటు డేటింగ్ కొనసాగించి, తన ప్రియుడు అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వయసులో తనకన్నా పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్‌ను మొదట క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు ప్రియాంక, నిక్ జోనస్‌లు. ఆ తర్వాత హిందూ మత సంప్రాదాయంలో కూడ వీరి పెళ్లి జరిగింది.