కొందరు పుట్టుకతోనే వృద్దులు అన్నాడు శ్రీశ్రీ. కొంతమంది బద్దకంతో శరీరం గురించి పట్టించుకోకుండా అలా పెంచేస్తుంటారు. తరువాత హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ డబ్బులు పోగొట్టుకుంటుంటారు. కొంతమంది మాత్రం ఫిట్నెస్ కోసం తీవ్రంగా శ్రమిస్తుంటారు. ఫిట్ గా ఉండేందుకు నిత్యం వ్యాయామం వంటివి చేస్తుంటారు.
అలంటి వారు ఎంత వయసు వచ్చినా ఫిట్ గా ఉండటమే కాకుండా యవ్వనంలో ఉన్నట్టుగానే కనిపిస్తారు. టాలీవుడ్ లో నాగార్జున అందుకు ఉదాహరణ. అటు బాలీవుడ్ లో తీసుకుంటే ఫిట్నెస్ కు మారుపేరుగా చెప్పుకునే మలైకా అరోరా వయసు మీదపడుతున్నా.. అందంలోను, ఫిట్నెస్ లోను ఏ మాత్రం తగ్గదు.
45 సంవత్సరాలపై బడిన వయసున్న మలైకా.. ఫిట్నెస్ చూస్తే ఇంకా 20లోనే ఉన్నట్టుగా ఉంటుంది. ఉదయం యోగాతో ఆమె దినచర్య ప్రారంభం అవుతుంది. ఎంత బిజీగా ఉన్నా.. ఎక్కడ ఉన్నా సరే మలైకా ఫిట్నెస్ విషయంలో మాత్రం రాజీపడదు. తన అందానికి అసలు రహస్యం అదే అంటోంది.
ఆమె సోషల్ మీడియా ఓపెన్ చేసే యోగాకు సంబంధించిన ఫోటోలు కోకొల్లలుగా ఉంటాయి. యోగాసనాల గురించి ఆమె ఎలాంటి ఫోటో షేర్ చేసినా క్షణాల్లోనే వైరల్ గా మారుతుంది. నిన్నటి రోజున కొన్ని ఫోటోలు షేర్ చేసింది. మండే మూడ్ పేరుతో పెట్టిన ఆ ఫోటోలు సోషల్ మీడియాను ట్రెండ్ అవుతున్నాయి. ఆ వయసులో అంత ఫిట్నెస్ సాధించడం అంటే మాములు విషయం కాదు.