రాక్షసుడు ట్రైలర్ రిలీజ్...!

guyyala Navya
బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా అనుపమ పరమేశ్వరన్ కథానాయకగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'రాక్షసుడు'. తమిళంలో సూపర్ హిట్ కొట్టిన క్రైం త్రిల్లర్ 'రాచ్చసన్' సినిమాకి ఇది రీమేక్ గా రూపొందింది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ తో ప్రేక్షకుల అంచనాలను పెంచేసిన రాక్షసుడు సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదల అయ్యింది. 


క్రైం త్రిల్లర్ రాక్షసుడు సినిమా మొత్తం హత్యలు చేసి రాక్షస ఆనందం పొందే ఓక సైకో చుట్టూ తిరిగే కథ అని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఈ ట్రైలర్ లో బెల్లంకొండ శ్రీనివాస్ ఆ సైకో హంతకుడు కోసమే వచ్చిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమాలో చూపించారు. అయితే ఈ సినిమా ఆగష్టు 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 


కాగా ఈ సినిమాకు జీబ్రాన్ సంగీతాన్ని అందించారు. ఇటీవలే కాజల్ అగర్వాల్ నటించిన సీత సినిమాతో తెలుగు ప్రేక్షకులను బెల్లంకొండ శ్రీనివాస్ పలకరించినప్పటికీ సినిమా హిట్ అవ్వలేదు. దీంతో ఈ రాక్షసుడు సినిమాపై భారీ అంచనాలు పెట్టేసుకున్నారు హీరో శ్రీనివాస్. మరి ఈ సినిమా అయినా బెల్లంకొండ శ్రీనివాస్ ఆశించినట్లు హిట్ ఇస్తుంది ఏమో చూడాలి. 


Its #Rakshasudu 👹 Time..!
A psycho-thriller to entertain you all...! Here's the trailer of #Rakshasuduhttps://t.co/SDbTIR9G1o#RakshasuduOnAug2nd

— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) July 18, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: