ఆదిత్య వర్మ.. అర్జున్ రెడ్డిని మించిపోతుందా? అంచనాలు పెంచేస్తున్న విక్రమ్ తనయుడి సాంగ్
ధృవ్ అర్జున్ రెడ్డి రీమెక్ "ఆదిత్య వర్మ"తో హీరోగా పరిచయమవుతున్నాడు. అమెరికా, లండన్ లో నేర్చుకున్న యాక్టింగ్, సింగింగ్ ఉపయోగపడింది. అర్జున్ రెడ్డిలోని బ్రేకప్ సాంగ్ ట్యూన్ నే ఆదిత్య వర్మలో కూడా పెట్టారు. ఈ పాట్ ప్రమోషన్ వీడియోను రీసెంట్ గా రిలీజ్ చేశారు. కోలీవుడ్ లో ఇపుడు ఈ పాట గురించే మాట్లాడుకుంటున్నారు. తండ్రికి తగ్గ తనయుడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆదిత్య వర్మ సినిమాకు టీజర్ కంటే లేటెస్ట్ గా రిలీజైన సాంగ్.. హైప్ తీసుకొచ్చింది. ఓ ప్రొఫెషనల్ సింగర్ లా పాడి ఆకట్టుకున్నాడు. రిలీజైన 24గంటల్లో 5లక్షల వ్యూస్ రాగా 40వేల మందికి పైగా లైక్ చేశారు. పెద్దగా అంచనాలు లేని ఆదిత్యవర్మపై.. ధృవ్ పాడిన ప్రమోషన్ సాంగ్ ఇంట్రస్ట్ క్రియేట్ చేసింది.