రాహుల్, హిమజ నీ గట్టిగా టార్గెట్ చేసిన బిగ్ బాస్ ఇంటి సభ్యులు..!
అంతేకాకుండా ఈ సందర్భంగా ఆలీకి నలుగురిని నేరుగా నామినేట్ చేసే అవకాశం బిగ్ బాస్ కల్పించారు. దీంతో అలీ.. బాబా భాస్కర్, రాహుల్, హిమజ, వితికా పేర్లన సూచించారు. అలీ మనసుని మార్చి నామినేషన్స్ నుండి బయటపడటానికి ప్రయత్నించారు బాబా భాస్కర్. హిమజ-అలీలా మధ్య మళ్లీ కాసేపు చర్చ నడిచింది. తనను ఎందుకు నామినేట్ చేశావో అర్ధం కావడం లేదని హిమజ అడగడంతో నీకు అర్ధం కాదులే లైట్ తీసుకో అని చెప్పాడు. తర్వాత ఇంట్లో ఉన్న సభ్యులలో ఒకరు అయినా పునర్నవి.. హిమజ, రాహుల్‌ని నామినేట్ చేసింది.
రాహుల్‌ని నామినేట్ చేస్తూ.. అతను గేమ్‌ని సీరియస్ తీసుకోవడం లేదని నాకు బిగ్ బాస్ కాకపోతే ఇంకో లైఫ్ ఉందని అనుకుంటున్నాడని కారణం చెప్పింది. హిమజని నామినేట్ చేస్తూ.. ఆమె ఎప్పుడూ నేను చేసిందే కరెక్ట్ అని వాదిస్తోంది అంటూ చెప్పుకొచ్చింది. మొత్తం మీద జరిగిన నామినేషన్ ప్రక్రియ లో ఎక్కువగా రాహుల్, హిమజలను గట్టిగా టార్గెట్ చేశారు హౌస్ సభ్యులు. మొత్తంమీద ఐదవ వారంలో ఎలిమినేటి కి నామినేషన్ అయిన సభ్యులు రాహుల్, హిమజ, అషు, మహేష్, పునర్నవి, శివజ్యోతి, బాబా భాస్కర్లు.