నయనతార పై మండిపడుతున్న మెగా ఫ్యాన్స్..?
ఇటువంటి ప్రవర్తనతో నయనతార చాలాసార్లు చాలా పెద్ద అవకాశాలు కూడా పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటే వ్యక్తిగత జీవితంపై మీడియా ఎక్కడ ప్రశ్నలు వేస్తుందో అని నయన్ ప్రమోషన్స్ కు దూరంగానే ఉంటుంది అని చాలామంది అంటారు. అసలు మ్యాటర్ లోకి వస్తే సైరా సినిమాకు సైన్ చేసినప్పుడు నయన్ ప్రమోషన్ లో పాల్గొంటానని చెప్పినట్లు కోలీవుడ్ మీడియాలో టాక్ వస్తోంది. అయితే ఫైనల్ బేబీ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యేటప్పటికి షూటింగ్స్ లో బిజీగా ఉన్నానంటూ తప్పించుకుందని కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఇక ఆమె ఉండాల్సిన ప్లేస్ లో తమన్నా కనిపిస్తూ తన క్రేజ్ ను కూడా పెంచుకుంటోంది. ఆమె సినిమాలో నటించింది జస్ట్ గెస్ట్ రోల్ అయినప్పటికీ సినిమా ప్రమోషన్స్ కోసం పిలవగానే వెళుతోంది. కానీ నయన్ సినిమాలో మెయిన్ హీరోయిన్ అయినా గాని ప్రమోషన్ కార్యక్రమాల్లో నయనతార పాల్గొనకపోవడం పై మెగా అభిమానులు మండిపడుతున్నారు. ఇదే క్రమంలో నయనతార కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం కష్టమని సినిమా యూనిట్ కి చెప్పినట్టు టాక్.