ఎమోషనల్ అయిన చిరంజీవి కూతురు..!
వయసుతో సంబంధం లేకుండా సినిమా కోసం కష్టపడే తత్వం చిరంజీవిది అని ఇంకా రకరకాలుగా సైరా సినిమా ట్రైలర్ చూసి రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైరా సినిమా ట్రైలర్ చాలా వైరల్ గా మారింది. విడుదలైన అతి తక్కువ సమయంలోనే చాలా మంది ట్రైలర్ చూడటంతో సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్థమవుతుంది.
ఇటువంటి నేపథ్యంలో చిరంజీవి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. తాజాగా చిరంజీవి 64వ జన్మదినం సందర్భంగా మెగా కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత ట్వీట్ చేస్తూ తన సోదరుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాంచరణ్ కూడా ఇన్స్టాగ్రామ్లో తన తండ్రికి బర్త్ డే విషెష్ తెలియజేశాడు.తాజాగా మెగాస్టార్ చిన్న కుమార్తె శ్రీజ ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. నా ముఖంలో నవ్వు కనిపిస్తోందన్నా, నా జీవితం సంతోషంగా ఉందన్నా అందుకు కారణం నా తండ్రే. లవ్యూ డాడీ. మీకు జన్మదిన శుభాకాంక్షలు అని శ్రీజ ఎమోషనల్ పోస్ట్ చేసింది.