యంగ్ డైరెక్టర్ హీరో కానున్నాడా? టాలీవుడ్ ఇపుడిదే చర్చ!
పెళ్లి చూపులు సినిమా తర్వాత తరుణ్ భాస్కర్ రెండో ప్రయత్నంగా ఈ నగరానికి ఏమైంది సినిమా చేశాడు. ఈ సిినిమాను న్యూ ఏజ్ కాన్సెప్ట్ తోనే రూపొందించాడు. ఈ నగరానికి ఏమైంది మూవీ దర్శకుడిగా తరుణ్ భాస్కర్ కు మంచి పేరు తెచ్చినా బాక్సాఫీసు వద్ద మాత్రం నిరాశపరిచింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు ఇపుడు కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు.
సోషల్ మీడియాలో తన కొత్త సినిమాకు సంబంధించి తరుణ్ భాస్కర్ హింట్ ఇచ్చాడు. ఓ ఎక్సయిటింగ్ మూవీ చేయబోతున్నట్టు తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాడట. మరి ఆ మధ్య తరుణ్ భాస్కర్ హీరోగా చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఇది అందుకు సంబంధించిన అనౌన్స్ మెంటేనా కాదా అనేది త్వరలోనే తెలియనుంది. యువతను విశేషంగా ఆకట్టుకునేలా సినిమాలు తీసే తరుణ్ భాస్కర్ హీరోగా మారితే అదొక సెన్సేషనే అవుతుంది. ఎందుకంటే ఆయన నటించే సినిమాకు ఆయనే దర్శకత్వం వహించుకోవడం మామూలు విషయం కాదు. అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలి. అసలు తరుణ్ భాస్కర్ ఎలాంటి ప్రణాళిక వేసుకుంటున్నాడో త్వరలోనే తేటతెల్లమవనుంది.