మనం ఫేమ్ విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా , శరణ్య , లక్ష్మి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ప్రియాంక కు తెలుగులో ఇదే మొదటి సినిమా. ఈ చిత్రం నుండి ఇటీవల విడుదలైన హొయినా హొయినా అనే సాంగ్ శ్రోతలను ఆకట్టుకుంటుంది.
ఇక ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 2న విడుదలచేయనున్నట్లు సమాచారం. అయితే ఈ ట్రైలర్ గురించి అధికారిక ప్రకటన వెలుబడాల్సి వుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ చిత్రాన్ని మొదటగా ఈనెల 30 న విడుదలచేయాలనుకున్నారు కానీ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ సినిమా సాహో కూడా అదే రోజూ విడుదలకానుండడంతో పోటీఎందుకని వాయిదావేశారు .
డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదలకానుంది. ఇక అదే రోజు మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్నయాక్షన్ ఎంటర్టైనర్ వాల్మీకి కూడా విడుదలకానుంది. మరి ఈరెండు సినిమాల్లో బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా ఫై చేయి సాధిస్తుందో చూడాలి. ఇక ఈఏడాది సమ్మర్ లో జెర్సీతో ప్రేక్షకులముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టిన నాని ఈ గ్యాంగ్ లీడర్ కూడా అదే స్థాయిలో విజయం సాధిస్తుందని ధీమా గా వున్నాడు. కాగా ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను సరిగమ సినిమాస్ సొంతం చేసుకుంది.