రవితేజ సినిమాకి సీక్వెల్ చేస్తున్న విజయ్ దేవరకొండ…?
ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ లో పూరి జగన్నాథ్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించబోతున్నాడు అంటున్నారు ఇండస్ట్రీలో ఉన్న చాలామంది. గమ్మత్తైన విషయం ఇక్కడ ఒకటి ఏంటంటే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన ‘అమ్మానాన్న ఓ తమిళమ్మాయి’ సినిమా కి ప్రస్తుతం పోలిక విజయ్ దేవరకొండ చేయబోయే సినిమా సీక్వెల్ అని అంటున్నారు. ఇక విషయానికి వస్తే అప్పట్లో 2003 వ సంవత్సరంలో రవితేజ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి' సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.
ఇటువంటి నేపథ్యంలో పూరి జగన్నాథ్... విజయ్ దేవరకొండ కోసం తయారు చేస్తున్న స్క్రిప్ట్ లైన్ కూడా ఆ సినిమాకి సిమిలర్ గా ఉన్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. అంతేకాకుండా సినిమాలో బాక్సింగ్ సన్నివేశాలు మరింత ఇంటెన్సిటీతో చూపించబోతున్నారట. విజయ్ దేవరకొండని తెరపై మాసివ్ గా చూపించడానికి ఈ కథను ఎన్నుకున్నాడని చెబుతున్నారు. మరో పక్క డియర్ కామ్రేడ్ సినిమా దారుణంగా ఫ్లాప్ అవడంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని విజయ్ దేవరకొండ ఈ స్టోరీ సెలక్ట్ చేసుకున్నట్లు సమాచారం.