మహేష్ బాబు ఎంత మంచివాడో..!
ఈ నేపథ్యంలో ఈ విషయాలకు సంబంధించిన వివరాలను ఇతరులకు తెలియజేయటానికి ప్రముఖ మీడియా సంస్థ శ్రేయాస్ మీడియా వాటి వివరాలను ఫోన్ నెంబర్లను అందుబాటులో సోషల్ మీడియాలో పెట్టింది. మహేష్ బాబు చేస్తున్న ఈ సహాయాన్ని అందరికీ తెలిసేలా ఫోన్ నెంబర్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇలాంటి మంచి పనులు మహేష్ బాబు ఇటీవల చేస్తూనే ఉన్నారు పలు సేవా కార్యక్రమాలు చేస్తూ గతంలో కృష్ణాజిల్లాలో సొంత ఊరు బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడ ఉన్న ప్రజలకు సామాజికంగా ఆరోగ్యపరంగా వారి జీవితాల్లో వెలుగులు నిండడం కోసం మహేష్ బాబు తనదైన శైలిలో చెరగని ముద్ర వేశారు.
అయితే తాజాగా చిన్నారుల కోసం మహేష్ చేయబోతున్న ఈ కార్యక్రమం పట్ల మహేష్ బాబు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాలర్ ఎగరేసుకుంటూ మహేష్ బాబు అభిమాని అని చెప్పుకోవడానికి సిగ్గు పడనవసరం లేదు అంటూ మా మహేష్ బాబు చాలా మంచివాడు అని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమా చేస్తున్నారు. అయితే మహేష్ బాబు తల పెట్టబోయే గుండె కు సంబంధించిన ఆపరేషన్ కార్యక్రమాలను భార్య నమ్రత చూసుకుంటున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.