ఈ ఏడాది సమ్మర్ లో స్పోర్ట్స్ డ్రామా 'జెర్సీ' తో సూపర్ హిట్ కొట్టి విమర్శకుల నుండి ప్రశసంలు అందుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఇక ఇప్పుడు నాని తాజాగా 'నానీస్ గ్యాంగ్ లీడర్' తో ప్రేక్షకులముందుకువచ్చాడు. అయితే జెర్సీ లాగా విడుదలక ముందు ఈ చిత్రం సందడి చేయలేకపోయింది. దాంతో పెద్దగా అంచనాలు లేకుండానే ఈ రోజు ఈచిత్రం విడుదలైంది. ఇక ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్స్ కూడా అయిపోయాయి.
ప్రీమియర్స్ నుండి వస్తున్న టాక్ ప్రకారం సినిమా డీసెంట్ గా ఉందట. సింపుల్ స్టోరీ ఎక్కడా కన్ఫ్యూజన్ లేని స్క్రీన్ ప్లై తో సరదాగా సాగిపోయిందని అంటున్నారు. నాని నటన , కామెడీ , అనిరుద్ సంగీతం సినిమా కు హైలైట్స్ గా నిలిచాయట. మల్టీ ఫ్లెక్స్ ప్రేక్షకులు అయితే సినిమా ను బాగానే రిసీవ్ చేసుకుంటారని అంటున్నారు. మరి బీసీ సెంటర్ల నుండి కూడా మంచి రెస్పాన్స్ వస్తే గ్యాంగ్ లీడర్ కు తిరుగుండదు. దాని మీదనే సినిమా విజయావకాశాలు ఆధారపడి వుండనున్నాయి.
మనం ఫేమ్ విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో కామెడీ మరియు రివెంజ్ డ్రామా గా తెరక్కిన ఈ చిత్రంలో కేరళ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించగా ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ విలన్ రోల్ లో నటించాడు. కాగా తెలుగులో ప్రియాంక కు ఇదే మొదటి సినిమా. కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందించిన ఈచిత్రంలో సీనియర్ నటీమణులు లక్ష్మి , శరణ్య కీలక పాత్రల్లో నటించగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.