ఇన్స్టాగ్రామ్ లో సమంత షాకింగ్ పోస్ట్ ..... సోషల్ మీడియాలో వైరల్....!!

Mari Sithara
ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన సమంత రూత్ ప్రభు, తొలి సినిమాతోనే సూపర్ డూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవడంతో పాటు, తన అందం మరియు అభినయంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మంచి పేరు సంపాదించింది. ఇక అక్కడినుండి మెల్ల మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగిన సమంత, ఇప్పటివరకు తెలుగు, తమిళ భాషల్లోని దాదాపుగా అందరు స్టార్ హీరోలతో నటించింది. ఇక ఇటీవల తన తొలి చిత్ర హీరో మరియు అక్కినేని వారి అబ్బాయి అయిన, 

నాగచైతన్యను వివాహమాడి, అక్కినేని వారింటి కోడలైన సమంత, పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తున్నారు. ఇకపోతే ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉండే సమంత, నేడు తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్, ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది. ఆ పోస్టులో ఆమె తన తలపట్టుకుని దిగాలుగా చూస్తూ ఉండడం గమనించవచ్చు. 'తాను ఇలా ఎందుకు తల పట్టుకు కుర్చున్నానని మాత్రం అడగకండి' అంటూ సమంత తన పోస్ట్ లో తెలిపింది. దీంతో సమంత చేసిన కామెంట్ ప్రేక్షకుల్లో అలానే ఆమె ఫ్యాన్స్ లో చర్చనీయాంశంగా మారింది. 

అదీకాక ఆ ఫొటోలో ఆమెకు మేకప్ కూడా లేకపోవడంతో, సమంతకు ఏమై ఉంటుంది, అసలు ఆమె అంత దిగాలుగా తలపట్టుకుని ఎందుకు కూర్చుంది అంటూ పలువురు నెటిజన్లు ఆమె పోస్ట్ కు స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల మజిలీ, ఓ బేబీ సినిమాలతో రెండు వరుస సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్న సమంత, ఒకవేళ ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఉందేమో అంటూ పలువురు ఆమె ఫ్యాన్స్ అనుమానపడుతున్నారు. మరి సమంత ఎందుకలా దిగాలుగా తల పట్టుకుని కూర్చుంది అనే దానికి, స్వయంగా ఆమే సమాధానమిస్తేనే గాని అసలు వాస్తవం తెలియదని అంటున్నారు సినీ విశ్లేషకులు......!!
View this post on Instagram
Unfiltered !!!! Don’t ask me what I am doing with my hand though 🙄🤓🍓

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: