పవన్ కళ్యాణ్ సినిమా అంటే వెరైటీ గా రియాక్ట్ అయిన హరీష్ శంకర్..?
ఇటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ తో సినిమా అనేదాన్ని విషయంపై డైరెక్టర్ హరీష్ శంకర్ చాలా వెరైటీగా రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో జరిగింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో హరీష్ ప్రసంగిస్తున్న సమయంలో అభిమానులు పదే పదే పవన్ తో సినిమా ఎప్పుడు అనే ప్రశ్నలు సంధించారు. అభిమానుల అత్యుత్సాహంపై హరీష్ శంకర్ స్పందన ఆసక్తికరంగా ఉంది. మీరు విజిల్స్ వేసి, కేకలు పెడితే కుదరదు. అది జరగాలని అభిమానులంతా బలంగా కోరుకోండి.. అయిపోద్ది అని హరీష్ శంకర్ కామెంట్స్ చేశాడు.
అంటే ఇప్పటికీ హరీష్ పవన్ తో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాడా అనే చర్చ జరుగుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చే ఇండస్ట్రీలో అనేక రికార్డు సృష్టించి పవన్ కల్యాణ్ కెరియర్లోనే అతి పెద్ద హిట్ సినిమాగా నిలిచింది. ఇటువంటి నేపద్యంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తలమునకలై ఉండగా హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి.