బిగ్ బాస్ వైరల్ న్యూస్ అలీ రెజా రీఎంట్రీ..?
కానీ నిన్న ఓటింగ్ లైన్లు తెరుచుకోలేదు. ఎందుకంటే నామినేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. నిన్నటి ఎపిసోడ్ లో మహేష్ మాత్రం నామినేషన్ లోకి వచ్చాడు. దీంతో ఇంకా నామినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఇటువంటి నేపథ్యంలో మరో పక్క ఈ వీక్ నామినేషన్ ప్రక్రియ ఉండదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే సీజన్ త్రీ స్టార్ట్ అయిన నాటి నుండి బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సభ్యులను తిరిగి ఇంటిలోకి తీసుకురావటానికి బిగ్ బాస్ షో నిర్వాహకులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వీరికోసం ఓటింగ్ చేపట్టనున్నారని టాక్. అదే గనుక నిజమైతే అలీ రెజాకు అందరికంటే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది.
మరోపక్క సోషల్ మీడియాలో కూడా అలీ రెజా హౌస్ లోకి తీసుకురావాలని చాలా మంది నెటిజన్లు కోరుకుంటున్నారు. అంతేకాకుండా హౌస్ నుండి రోహిణి కూడా అనవసరంగా ఎలిమినేట్ అయినట్లు వార్తలు వినబడుతున్నాయి. దీంతో ఇప్పటిదాకా ఎలిమినేట్ అయిన సభ్యుల విషయంలో బయటకు వచ్చిన సమాచారం మేరకు కంటెస్టెంట్ లను తిరిగి లోపలికి తీసుకోవడం నిజమే అయితే కచ్చితంగా అలీ రెజా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం గ్యారెంటీ అని చాలామంది కామెంట్ చేస్తున్నారు.