నాగచైతన్య కి సంబంధించిన కొత్త విషయం బయట పెట్టిన సమంత..!
ఈ సందర్భంగా అక్కినేని సమంత జరగబోయే షోలో అనేక పడకగది రహస్యాలు ప్రేక్షకులతో చెప్పుకోవటం జరిగింది. ఇంటర్వ్యూ లో భాగంగా రకరకాల ప్రశ్నలు యాంకర్ మంచు లక్ష్మీ సమంత అని అడిగారు. ఈ సందర్భంగా అసలు మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి అంటూ సమంత ని యాంకర్ లక్ష్మీ ప్రశ్నించగా కొంత సేపు నిశ్శబ్దం రాజ్యమేలింది వారిద్దరి మధ్య.
దీంతో ఆ సందర్భంలో యాంకర్ లక్ష్మి కలగజేసుకుని పెళ్లికి ముందు మీ మధ్య ఎటువంటి రిలేషన్ షిప్ ఉందో అంతా నాకు తెలుసు పెళ్లికి ముందే మీమధ్య లివిన్ రిలేషన్ షిప్ ఉందని నాకు తెలుసు .. ఏదీ దాచకుండా చెప్పు`` అంటూ రెట్టిస్తూ ప్రశ్నించారు లక్ష్మీ. అలాగే పెళ్లి తర్వాత ఏ మూడు సంగతులు బెడ్ రూమ్ మ్యాటర్స్ ని మార్చాయి? అని ప్రశ్నిస్తే.. సామ్ తన హబ్బీకి సంబంధించిన ఓ టాప్ సీక్రెట్ ని బహిర్గతం చేశారు. ఆ సీక్రెట్ ఇంట్రెస్టింగ్. చైతన్యకు తలగడ(పిల్లో) మొదటి భార్య. తనని ఎప్పుడు ముద్దు పెట్టుకోవాలనుకున్నా మా ఇద్దరి మధ్యలో అది అడ్డొస్తోంది.. అంటూ వాపోయింది సామ్. చాలా తక్కువ మందికి తెలిసిన ఈ రహస్యాన్నిసమంత ఇటీవల బయట పెట్టడం జరిగింది.