గెటప్ శీను పై సంచలన కామెంట్స్ చేసిన నాగబాబు..!
గెట్ శ్రీను నాకు కొడుకు కాదు.. కానీ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అతడిలో ఆ ప్రతిభ గమనించా అంటూ నాగబాబు పేర్కొన్నాడు. కానీ ఇండస్ట్రీ గెటప్ శీను ని సరిగ్గా గుర్తించడం లేదని ఉపయోగించుకోవడం లేదని సరిగ్గా సీన్ ఒకే ఒక అవకాశం మంచిది దొరికితే ఇండస్ట్రీలో తిరుగు ఉండదని నాగబాబు పేర్కొన్నాడు. అంతేకాకుండా జబర్డస్త్ లో వివిధ గెటప్ లలో ఎలా, వివిధ బాడీ లాంగ్వేజ్ లలో ఎలా నటించాడో నాకు తెలుసు. గెటప్ శ్రీనుని ఉపయోగించుకోక పోతే అది ఇండస్ట్రీకే నష్టం అని ఒక మంచి నటుడిని కోల్పోవడం జరుగుతుందని నాగబాబు అభిప్రాయపడ్డారు.
దీంతో నాగబాబు చేసిన కామెంట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. అంతేకాకుండా రాంప్రసాద్ మరియు సుడిగాలి సుధీర్ గురించి ఆసక్తికరమైన విషయాలు బాబు తెలియజేశారు. రాంప్రసాద్ మంచి రచయిత అంటూ పంచ్ డైలాగులు రాయడం లో రాంప్రసాద్ కి మించిన వారు లేరని అద్భుతమైన ప్రతిభ ఉన్నట్లు నాగబాబు తెలిపారు. మరియు అదే విధంగా సుడిగాలి సుదీర్ అయితే హీరో అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నాగబాబు జోస్యం చెప్పారు.