సస్పెన్స్ థ్రిల్లర్ `జల్లికట్టు' ట్రైలర్
కంప్లీట్ డార్క్ లో తీసిన ఈ ట్రైలర్ ఈ సినిమా బిజినెస్ ని ప్రభావితం చేస్తోందనేందుకు ఈ లెక్కలే ప్రూఫ్. చాలా ఇంటెన్స్ తో వున్నఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించడంతో ఈ చిత్ర ఓవర్సీస్ రైట్స్ కోసం చాలా మంది పోటీ పడ్డారట అని సమాచారం . అయితే ఫ్యాన్సీ రేట్ ని కోట్ చేసిన సోహన్ రాయ్ గ్రూప్ ఇండీవుడ్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ సొంతం కూడా చేసుకుంది. ఈ సంస్థ యుకే- యూరప్- సింగపూర్- కొరియా దేశాల్లో ఈ చిత్రాన్ని పంపిణీ చేయబోతోందంటే దీనిపై ఎంత ఆసక్తి క్రియేటైందో అర్థం చేసుకోవచ్చు మరి.
ముఖ్యంగా ఈ సినిమాకి ఉపయోగించిన లైటింగ్ స్కీమ్ మైమరిపిస్తోంది. నేపథ్య సంగీతం రక్తి కట్టిస్తోందని ప్రశంసలొచ్చాయి. చిన్న సినిమా అయినా కంటెంట్ నచ్చితే పాన్ ఇండియా సినిమాలా విజయం అందుకుంటున్న రోజులివి. మరి జల్లికట్టు ఎలాంటి మ్యాజిక్ చేయనుందో చూడాలి. తెలుగు రాష్ట్రాల వరకూ ఇప్పటివరకూ ఈ సినిమా బిజినెస్ సాగలేదు. అయితే ఇక్కడా మన వాళ్లకు కంటెంట్ నచ్చి రిలీజ్ చేసే వీలుందని అంచనా కూడా వేస్తున్నారు.