వెరైటీగా సీజన్ 3 లో నిద్రపోయిన బిగ్ బాస్..!
అంతేకాకుండా వాటితో పాటు ఇంకా కొన్ని టాస్క్ లు..ఇంటిలోని సభ్యులకు బిగ్ బాస్ ఇచ్చారు. ఏమిటంటే..శ్రీముఖి అరవకుండా అలీ గుర్రం ఎక్కించుకుని 20 రౌండ్లు కొట్టాలి. పాపం అలీ తనకు కష్టంగా ఉన్నా టాస్క్ పూర్తి చేశాడు. బాబా భాస్కర్ తన శరీరంపై ఉన్న జుట్టుని వాక్స్ చేయాలి. మహేష్ విట్టా తలపై ప్లేట్ పెట్టుకుని కింద పడకుండా.. గోడ కుర్చీ వేయాలి. వితికా, రాహుల్ బెలూన్స్కి షేవింగ్ క్రీమ్ రాసి నీట్గా షేవ్ చేయాలి. శివజ్యోతికి అలీ కితకితలు పెట్టాలి.. ఈ టాస్క్ పూర్తయిన తరువాత హౌస్ మేట్స్ కి మరో టాస్క్ ఇచ్చాడు.
బిగ్ బాస్ ఎలా ఉంటాడో ఊహించి బొమ్మ గీయాలి. బిగ్ బాస్ బొమ్మ గీయడానికి హౌస్ మేట్స్ ఇబ్బందులు పడ్డారు. ఫైనల్ గా తమకు నచ్చినట్లు గీసి దానికి అర్ధం కూడా చెప్పారు. మరి అదే విధంగా గురువారం ఎపిసోడ్ మాదిరిగానే శుక్రవారం జరిగిన ఎపిసోడ్ గా కూడా కేకులు ఇంటిలో సభ్యులకు బిగ్ బాస్ తినిపించారు. అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ బర్తడే సెలబ్రేషన్స్ లో భాగంగా రాహుల్ పాడిన పాటకు బాబా భాస్కర్ చేసిన వీడియో...ఎపిసోడ్ కే హైలెట్ గా నిలిచింది.