హైపర్ ఆది..ఇకమీదటయినా నోటిదురుసు తగ్గిస్తాడా అని ప్రశ్నిస్తున్నారు
అయితే,అందరు ఒక ఎత్తు అయితే,హైపర్ ఆది స్కిట్స్ మరింత ప్రత్యేకం.అతడు అలవోకగా వేసే పంచ్‌లు కానీ, ప్రాసలకు కానీ జడ్జిలు నాగబాబు, రోజా సైతం పగలబడి నవ్వుకుంటారు. ఆది ఎంతగా నవ్విస్తాడో, అంతే తొందరగా వివాదాల్లోఉంటారు.ఇదివరకు కామెడీ స్కిట్లో భాగంగా రోజాపై వ్యాఖ్యలు చేసారు,తర్వాత షోలో దేశంలోని స్త్రీలపై కూడా అభ్యంతర వ్యాఖ్యానాలు చేసి పలు వార్తల్లో నిలిచారు ఆది.
అయితే తాజాగా వచ్చే వారం విడుదుల కానున్న హైపర్ ఆది స్కిట్ ప్రోమోను విడుదల చేశారు. అందులో ఆదితో పాటు, ఆటో రాంప్రసాద్ కూడా ఓ పాత్ర చేస్తున్నారు.స్కిట్ లో భాగంగా,తాను చెప్పిందే ఆది మరలాచెప్తున్నారని ఆటో రాంప్రసాద్ అనగా,మరి ఏడేళ్ల పాటు నువ్వు కూడా తిప్పి తిప్పి అవే స్కిట్లు చెయ్యట్లేదా అని అన్నారు.దీనితో అందరు ఒక్కసారిగా షాక్‌కు గురవుతారు. ఆ వెంటనే నాగబాబు, రోజా నవ్వడంతో స్కిట్ ముందుకు సాగింది. ఇలా అనేక సందర్భాల్లో వేరే వాళ్ల స్కిట్లపై హైపర్ ఆది వెరైటీ వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు.