తెలుగులో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్న "సామజవరగమన" సాంగ్!
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు చాలా స్లోగా సినిమాలో సాంగ్ తో మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ‘సామజవరగమన’ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్ అంత ఇంత సెన్సేషన్ క్రియేట్ చెయ్యట్లేదు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడగా…ఇటీవల వచ్చిన పాటలలో ఈ పాట మ్యూజిక్ లవర్స్ కి తెగ నచ్చేసింది.
అందుకే ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా పాటకు రానన్ని వ్యూస్ ఈ పాటకు వచ్చేసాయి. యూ ట్యూబ్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ పాట విడుదలైన 24 గంటల్లో 6 మిలియన్ వ్యూస్ , 313కే లైక్స్ వచ్చాయి. ఇప్పటివరకు ఈ పాటకు 40 మిలియన్స్ వ్యూస్, 7 లక్షల లైక్స్ వచ్చాయి. తెలుగులో ఒక సాంగ్ కు ఇన్ని లైక్స్ , వ్యూస్ రావడం ఇదే ప్రధమం. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగులో సామజ వర గమన కొత్త రికార్డు యూట్యూబ్ లో సృష్టించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తారీకున ఈ సినిమా విడుదల కానుంది.