ఆడిషన్ కోసం వెళ్తే... ఆ స్టార్ హీరో స్కర్ట్ లో చేయిపెట్టి.?
సినిమా ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్న హీరోయిన్లు ఎంతోమంది ఉంటారు. కాగా మీ టూ ఉద్యమం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఉద్యమంలో తమకు తొలినాళ్లలో జరిగిన చేదు అనుభవాలు ప్రముఖ సెలబ్రిటీలే కాకుండా వివిధ రంగాలకు చెందిన మహిళలు తెలిపారు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు తమ కెరీర్ తొలినాళ్లలో చేదు అనుభవాలను ఎదుర్కొన్నామని తెలిపిన విషయం తెలిసిందే. ఇక మనదేశంలో నటి తనుశ్రీ దత్తా మీటూ ఉద్యమానికి ఊపిరి పోసింది... ఇక తెలుగులో శ్రీరెడ్డి ఉద్యమాన్ని కొనసాగించింది. కాగా మొదట మీటూ ఉద్యమం హాలీవుడ్లో మొదలైన విషయం అందరికి తెలిసిందే.
అయితే తాజాగా ఓ హాలీవుడ్ నటి నవమీ హారిస్ తన కెరియర్ తొలినాళ్లలో తనకు ఎదురైన చేదు అనుభవాలను తెలిపింది. కెరీర్ తొలినాళ్లలో సినిమాలో ఛాన్స్ కోసం చాలా ఆడిషన్స్ కు వెళ్లాను అని చెప్పింది నవోమి . ఈ క్రమంలోనే ఓ రోజు ఆడిషన్ వెళ్లానని ఆ అడిషన్లో డైరెక్టర్, కాస్టింగ్ డైరెక్టర్, సినిమా హీరో చేస్తున్నారని తెలిపింది. అయితే ఆడిషన్స్ కు వెళ్లిన ఆమెతో ఆ స్టార్ హీరో అసభ్యంగా ప్రవర్తించాడట. తన దగ్గరికి వచ్చి అకస్మాత్తుగా తన స్కర్ట్ లొ చెయ్యిపెట్టాడట ఆ స్టార్ హీరో. స్కర్ట్ లో చేయిపెట్టి అసభ్యంగా తాకాడని నవోమి తెలిపింది. ఆ హీరో అలా చేయగానే భయబ్రాంతులకు గురయ్యానని తెలిపింది. కాగా ఆ హీరో అలా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే అక్కడ ఉన్న వారు ఎవరు మాట్లాడలేదని అలాగే చూస్తూ ఉండిపోయారని తెలిపింది.
అయితే ఆ ఘటన తన జీవితంలో మర్చిపోలేనని చెప్పిన హాలీవుడ్ నటి నవోమి ... ఇక అప్పుడప్పుడే ఇండస్ట్రీకి వచ్చి అవకాశాలు అందుకుంటూ ఉండడంతో ఈ విషయం ఎవరికీ చెప్పలేదని ఆమె తెలిపింది. ప్రస్తుతం నవోమి హారిస్ జేమ్స్ బాండ్ చిత్రం నో టైం టూ డై అనే సినిమాలో నటిస్తుంది. సినిమా 2020 ఏప్రిల్ 3న విడుదల కాబోతుంది. అయితే మన దేశంలో కూడా మీ టూ ఉద్యమంలో భాగంగా ఎంతో మంది స్టార్ హీరోయిన్లు తమకు కెరీర్ తొలినాళ్లలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకు ఉన్నారు. కొంతమంది సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్లకి క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కోవడం తప్పదని వ్యాఖ్యానించారు.