బిగ్ బాస్ 3 లో రాజకీయాలు జరగకపోతే రాహులే గెలుస్తాడు అంటున్న ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యుడు..!
ఇదిలా ఉండగా హౌస్ నుండి వితికా కంటే ముందు వారం ఎలిమినేట్ అయిన మహేష్ విట్టా తాజాగా బిగ్ బాస్ 3 టైటిల్ విన్నర్ గురించి సంచలన కామెంట్ చేశాడు. ఇటీవల ఓ టీవీ ఛానల్ లో మాట్లాడిన మహేష్ విట్టా అనేక విషయాలు చెప్పుకొచ్చారు. అసలు బిగ్ బాస్ హౌస్ లోకి న్యాచురల్ స్టార్ నాని వల్ల షోలోకి రాగలిగానని చెప్పాడు. ఇక హౌస్ లో పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. హౌస్ లో ప్రతీ ఒక్కరికీ చాలా మెంటల్ టెన్షన్ ఉంటుందని చెప్పాడు.
బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ ల కారణంగా హౌస్ లో చిన్న చిన్న గొడవలు జరిగేవని.. వాటిని చాలా పెద్దగా చిత్రీకరిస్తారని మహేష్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో బాబా భాస్కర్ అంటే తనకు చాలా ఇష్టమని మహేష్ విట్టా పేర్కొన్నారు. ఇక టైటిల్ విషయానికి వస్తే ఓట్ల ప్రకారంగా రాహుల్ విన్నర్ అని.. లోపల ఏదైనా రాజకీయాలు జరిగితే మాత్రం శ్రీముఖి విన్నర్ కావొచ్చని.. ఆ రాజకీయాలు ఏంటనేవి మాత్రం మనం చెప్పలేము అంటూ మహేష్ విట్టా పేర్కొన్నారు.