టైగర్ : రివ్యూ
టైగర్ సినిమాలో నటీనటుల నటన ఏదీ పెద్దగా చెప్పుకునే స్థాయిలో లేవు. రాహుల్ రవీంద్రన్ తనకు ఇచ్చిన సాఫ్ట్ రోల్ లో బాగా చేసాడు. బేసిక్ గా తను ఇలాంటి పాత్రలు చేయడంలో మంచి పేరుంది. మరోసారి ఎమోషనల్ గా మంచి పాత్ర చేసి మెప్పించాడు. సందీప్ కిషన్ ఈ సినిమాలో తన టాలెంట్ ని చూపడానికి తక్కువ సమయం దొరికింది. ఎప్పటిలానే అక్కడక్కడా కొన్ని సీన్స్ లో ఓవర్ అనిపిస్తుంది. కానీ ఎక్కువ సీన్స్ లో బాగా చేసాడు. ఇకపోతే మా లుక్ మరియు ఇంట్రడక్షన్ సీన్స్ లో చాలా పర్ఫెక్ట్ గా సరిపోయాడు. ఆ సీన్స్ లో ప్రెజంటేషన్ కూడా చాలా బాగుంది. రన్ రాజా రన్ ఫేం సీరత్ కపూర్ ఈ సినిమాలో పెద్దగా ఆకట్టుకోలేదు. రాహుల్ - సీరత్ లవ్ ట్రాక్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. కాశీ విశ్వనాధ్, తనికెళ్ళ భరణి, ప్రవీణ్ లు చేసిన చిన్న చిన్న పాత్రలు వృధా అయ్యాయి. కమెడియన్స్ తాగుబోతు రమేష్, చిత్రం శీను, సత్య, రఘు మరియు ఫిష్ వెంకట్ లు ఉన్నంతలో బాగా చేసారు. సత్య - సందీప్ కిషన్, తాగుబోతు రమేష్ - సందీప్ కిషన్ ట్రాక్స్ కామెడీగా ఉన్నాయి. బాలీవుడ్ యాక్టర్ బాబీ పర్వేజ్ చిన్న పాత్రలో ఓకే అనిపించాడు.
టైగర్ సినిమాలో చెప్పడానికి చాలా చిన్న పాయింట్ అయినా చూపించడానికి చాలా విషయాలే ఉన్నాయి. కానీ వాటిని పర్ఫెక్ట్ గా ఆన్ స్క్రీన్ ప్రాజెక్ట్ చేయలేకపోయారు. కొన్ని సీన్స్ లో ఆడియన్స్ ని బాగా ఇంప్రెస్ చేయడం - కొన్ని చోట్ల మాత్రం చాలా లో పిచ్ లో సీన్స్ ఉండడం వలన ఈ సినిమా బిలో యావరేజ్ గా మిగిలింది. లైన్ అందరికీ తెలిసిందే అయినా డైరెక్టర్ విఐ ఆనంద్ దానిని ఇంకాస్త జాగ్రత్తగా డెవలప్ చేసి ఉండాల్సింది. అలాగే స్క్రీన్ ప్లే - నెరేషన్ విషయంలో కూడా కేర్ తీసుకొని ఉంటే మంచి సినిమా అయ్యుండేది. ఓవరాల్ గా టైగర్ సినిమా రౌద్రంగా గర్జించలేకపోయింది. ఈ సినిమాలో కొన్ని నెస్ట్ ఎపిసోడ్స్ ఉన్నాయి, అలాగే బోర్ కొట్టించే కొన్ని ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. సో కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు.. కావున మా రివ్యూ చదివి సినిమాకి వెళ్ళాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేస్కొండి..
మరింత సమాచారం తెలుసుకోండి:
-
REVIEW
-
Tiger
-
Tiger 1
-
Cinema
-
sundeep kishan
-
Comedy
-
Love
-
vishnu
-
Kasi
-
Hyderabad
-
Letter
-
prema
-
rahul new
-
rahul
-
K L Rahul
-
Rahul Sipligunj
-
raja
-
seerat kapoor
-
praveen
-
Chitram
-
raghu
-
fish venkat
-
satya
-
sandeep
-
bollywood
-
Bobby
-
Arya 2
-
marriage
-
Mukunda
-
Director
-
anand malayalam actor
-
Anand Deverakonda
-
murugadoss
-
A R Murugadoss
-
Manam
-
thaman s
-
Tamil
-
prasad
-
Audience