ఎటో వెళ్లిపోయింది మనసు : రివ్యూ

Prasad

YVM Live Tweet Review ||  YVM Full English Review

సమంత, నాని జంటగా నటించిన సినిమా ఎటో వెళ్లిపోయింది మనసు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాకు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు. ప్రేమకథ చిత్రాలను గౌతమ్ మీనన్ అందంగా తెరకెక్కిస్తాడనే పేరు ఉండటంతో పాటు, ఈ సినిమాలో హిట్ జంట నాని-సమంత జంటగా నటించడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఎటో వెళ్లి పోయింది మనసు ఎలా ఉందో చూద్దాం..! చిత్రకథ :   వరుణ్ కృష్ణ (నాని), నిత్య (సమంత) చిన్నతనం నుంచి స్నేహితులు. ఒకే స్కూల్ లో చదువుతారు. తరువాత కూడా పరిచయం సాగిస్తుంటారు. అయితే ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో పొరపాటు పడుతూ గొడవ పడుతుంటారు. దీంతో వంశీ కృష్ణ వేరే అమ్మాయితో పెళ్లికి కూడా సిద్ధపడతాడు. వరుణ్-నిత్య చివరికి ఒకటయ్యారా లేదా అనే అంశంతో ఈ సినిమా సాగుతుంది. నటీనటుల ప్రతిభ :   నాని-సమంత ల జోడి అకట్టుకుంది. స్కూల్ రోజుల్లో, కాలేజ్ రోజుల్లో, బాధ్యతలు ఎంచుకునే సన్నివేశాలకు... ఇలా వివిధ పాత్రలకు ఇద్దరూ సరిగ్గా సరిపోయారు. సమంత నటన, గ్లామర్ యువ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. నాని నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అతని నటన, ముఖ్యంగా క్లైమాక్స్ లో అతని నటన ఆకట్టుకుంటుంది. దర్శకుడు ఊహించుకున్న సన్నివేశాలకు నాని తన నటనతో ప్రాణం పోశాడు. హీరో స్నేహితుడు గా కృష్ణుడు ఆకట్టుకుంటాడు. మిగిలిన వారు తమ పాత్రల పరిధిలో నటించారు. సాంకేతిక వర్గం పనితీరు : ఫోటోగ్రఫీ బాగుంది. నేపథ్య సంగీతం సన్నివేశాలకు తగినట్లుగా ఉంది. గుర్తుంచుకునే పాటలు, ఆకట్టుకునే పాటలు ఈ సినిమాలో లేవు. కోన వెంకట్ మాటల పదును ఈ సినిమాలో కనిపించదు. ఇద్దరు ప్రేమికుల మధ్య సాగే కథతో సాగే ఈ సినిమా స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగుతుంది. పట్టుగా స్క్రీన్ ప్లే ను నడపడంలో దర్శకుడు అక్కడక్కడ తడబడంతో కొన్ని సన్నివేశాలు బోర్ గా సాగుతాయి. సినిమా ప్రథమ భాగం, హీరో కుటుంబ నేపథ్యాన్ని చక్కగా చూపించిన దర్శకుడు, నాని-సమంతల సహాయంతో చిత్ర ముగింపును కూడా చక్కగా మలిచాడు. హైలెట్స్ :   నాని, సమంతల నటన, స్క్రీన్ ప్లే, డ్రాబ్యాక్స్ :   వినోదం లోపించడం, ప్రేమకథ కు బలాన్నిచ్చే సంగీతం లేకపోవడం చివరగా :   ప్రేమికుల కోసమే ‘ఎటో వెళ్లి పోయింది మననసు’
 

Yeto Vellipoyindi Manasu: Cast & Crew

  • Director: Gautham Menon, Producer: Gautham Menon, Reshma Gatala, Venkat Somasundaram, C. Kalyan and C. V. Rao
  • Music: Ilaiyaraaja, Cinematography: M. S. Prabhu, Editing : Anthony, Writer: Gautham Menon 
  • Star Cast: Nani, Samantha, Krishnudu, Anupama Kumar, Ravi Raghavendra, Vivek Pathak
  • Genre: Romantic Love Story, Censor Rating: U,  Duration: 02:30Hrs.
  •  
  Yeto Vellipoyindi Manasu Movie Review, Rating | Yeto Vellipoyindi Manasu Review | YVM Review | YVM Rating | Yeto Vellipoyindi Manasu Cast & Crew, Music, Performances | Samantha   te Yeto Vellipoyindi Manasu Telugu Movie Review;Rating;YVM Review;YVM Rating;Yeto Vellipoyindi Manasu Movie Review;Telugu;Review;Rating;Nani;Samantha;YVM;Goutham Menon; true APHerald APHerald APHerald https://www.apherald.com/ImageStore/images/Movies/Movies_Reviews/Yeto-Vellipoyindhi-Manasu-Review-300x300.jpg https://www.youtube.com/embed/fSMC1vifi-o  

More Articles on YVM || YVM Wallpapers & Events Photos || YVM Trailers, Songs & Videos

More Articles on YVM || YVM Wallpapers & Events Photos || YVM Trailers, Songs & Videos

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: