ట్వీట్ రివ్యు: కో అంటే కోటి
Ko Ante Koti: Tweet Review || English Full Review || తెలుగు ఫుల్ రివ్యూ
6:05pm : ట్వీట్ రివ్యూ పాఠకులకు స్వాగతం
6:10pm : వంశీ [శర్వానంద్], మాయామాస్టర్ [శ్రీహరి], చిట్టిగాడు, బుజ్జిగాడి పరిచయ సన్నివేశంతో చిత్రం మొదలైంది.
6:18pm : శర్వానంద్ తనకు తాను ఒక దొంగలా పరిచయం చేసుకుంటున్నాడు
6:25pm : శర్వానంద్ ఒక పెద్ద దొంగతనం కోసం మాయామాస్టర్, చిట్టిగాడు, బుజ్జిగాని గ్యాంగ్ లో చేరిపోతాడు.
6:28pm : శర్వానంద్ సినిమాలో మేకప్ లేకుండా సహజంగా కనిపిస్తున్నాడు.
6:32pm : తాగుబోతు రమేష్ చేసే కామెడీ ప్రేక్షకులలో ఒక్కసారిగా నవ్వులు విరబూస్తున్నాయి.
6:40pm : హీరోయిన్ సత్య [ప్రియానంద్] కలర్ ఫుల్ బ్లూ సారీతో అందాలను ఆరబోస్తూ తెరపై ఎంట్రీ ఇస్తుంది, వంశీ - సత్యల ప్లాష్ బ్యాక్ చెబుతున్న పరిచయ సన్నివేశంతో ప్రియానంద్ కనిపిస్తుంది.
6:45pm : చిత్రంలోని మొదటి పాట ‘బంగారు కొండ’ అనే పాటలో ప్రియానంద్ ను టీచర్ లా చూపించాడు.
6:50pm : చిత్రంలోని ‘ఆగిపో కాలమా’ అనే పాటతో శర్వానంద్ - ప్రియానంద్ ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమ చిగురించడం, ఆ ప్రేమను వ్యక్తపరిచే విధానం అందరిని ఆకర్షించుకుంటుంది.
7:05pm : మాయామాస్టర్ గ్యాంగ్ ఒక ఇంట్లో దొంగతనానికి పాల్పడటానికి ప్లాన్ చేసే కామెడీ సన్నివేశం ఫన్నీగా ఉంది.
7:10pm : ‘ దేహం దాహం’ అనే పాటలో మాయాగ్యాంగ్ వజ్రాల దొంగతనం చేసేందుకు ప్లాన్ చేస్తుంటారు.
7:20pm : విలన్ పరిచయ సన్నివేశంతో మాయాగ్యాంగ్ ప్లాన్ బెడిసికొటుతుంది. దీంతో ఫస్టాప్ కు బ్రేక్ పడుతుంది.
విశ్రాంతి
7:30pm : సెకండాఫ్ లో మాయామాస్టర్ గ్యాంగ్ వజ్రం దొంగలించడం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు, కాని ఇక్కడ దొంగతనం చేసే సన్నివేశం ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల ఈ సందర్భంలో ప్రేక్షకులకు బోరుకొటుడుతుంది.
7:40pm : ఆ సందర్భంలోనే తాగుబోతు రమేష్ చేసే కామెడీ సీన్ తో ప్రేక్షకులలో ఉత్సాహం కనబడుతుంది. మాయామాస్టర్ గ్యాంగ్ వారి ప్లాన్ సక్సస్ అవుతుంది.
7:56pm : మళ్లీ ప్లాష్ బ్యాక్ మొదలయింది.
8:05pm : ప్రియానంద్ - శర్వానంద్ లపై ‘ వరాల వాన’ అనే రొమాంటిక్ పాట ఉంది, అందులో లిప్ లాక్ ఉంది.
8:10pm : ప్రియానంద్ - శ్రీహరి ల మధ్య ట్విస్ట్ ఉంది.
8: 12 pm : కొత్త జీవితాన్ని ప్రారంభించడానికని ప్రియానంద్ వదిలేసి వంశి హైదరాబాద్ వెళ్లిపోతాడు.
8: 20 pm : శ్రీహరి సీక్రెట్ గా దాచిపెట్టిన డబ్బులను వంశీ వెతికే సన్నివేశాన్ని దర్శకుడు పనితీరు బాగాచూపిస్తున్నాడు.
8:28 pm : మాయామాస్టర్ శ్రీహరి క్యారెక్టర్ దేనికి విలువలివ్వకున్నా డబ్బుకు విలువనిచ్చే మాయాగా నటన బాగుంది.
8:37 pm : చిత్రం చివరి దశలో వంశీ, విలన్ మద్య ఫైట్ కొనసాగుతుంది.
8:45 pm : శర్వానంద్ శ్రీహరికి ఝలక్ ఇస్తాడు.
8:50 pm : శర్వానంద్ శ్రీహరి మధ్య ఫైట్ తో సినిమా సుఖాంతం అవుతుంది.
Ko Ante Koti Review : Cast & Crew
- Director: Anish Yohan Kuruvilla, Producer: Sharwanand, Music: Shakti Kanth
- Cinematography: Erukulla Rakesh and Naveen Yadav
- Star Cast: Sharwanand, Priya Anand and Sri Hari,
- Genre: Crime-Thriller Film, Censor Rating: A, Duration: 02:30Hrs.