ఆటాడుకుందాం..రా : రివ్యూ

మ్యూజిక్, కొన్ని కామెడీ సీన్స్మ్యూజిక్, కొన్ని కామెడీ సీన్స్రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే,లాజిక్ మిస్సింగ్ , డైరక్షన్
విజయ్ రామ్ అలియాస్ కార్తిక్ (సుశాంత్) ఫారిన్ నుండి తన మామయ్య విజయ్ రామ్ (మురళి శర్మ) ఇంటికి వస్తాడు. మొదటి చూపులోనే శృతి (సోనం భజ్వా) ప్రేమలో పడతాడు కార్తిక్. ఇక ఓ పక్క విలన్ శాతారాం విజయ్ రామ్ ఆనందాలను భంగం చేస్తుంటాడు. తమ్ముడి కూతురు పెళ్లి కోసం విజయ్ రామ్ తనకున్న ఒకే ఒక్క ఆధారం రైస్ మిల్ కూడా అమ్మాలని చూస్తాడు. దానికి శాంతారాం స్నేహితుడు పోసాని సహకారంతో 4 కోట్ల విలువ చేసే రైస్ మిస్ కేవలం 40 లక్షలకే కాజేయాలని ప్లాన్ చేస్తారు. అయితే విలన్స్ వేసిన ఈ ప్లాన్స్ ను కార్తిక్ తన ఐడియాలతో ప్రతిసారి ఆపేస్తుంటాడు. 20 ఏళ్ల క్రితం విజయ్ రాం తన స్నేహితుడు ఆనం ప్రసాద్ చేత మోసం చేయబడి అతన్ని దూరం చేసుకుంటాడు. అసలు ఇంతకీ కార్తిక్ గా వచ్చిన అతను విజయ్ రామ్ మేనళ్లుడేనా..? విజయ్ రామ్ స్నేహితుడు ఆనంద్ ప్రసాద్ చేసిన తప్పేంటి..? తన ఆస్తులన్ని కాజేసిన శాంతారాం దగ్గర నుండి విజయ్ రామ్ మళ్లీ ఎలా తన అస్తులను దక్కించుకున్నాడు అన్నది అసలు కథ.   

ఆటాడుకుందా రా.. అంటూ ఓ ఎనర్జీతో వచ్చిన సుశాంత్ సినిమాలో కూడా అదే ఎనర్జీ చూపించాడు. గత సినిమాలతో పోలిస్తే సుశాంత్ నటనతో మంచి పరిణితి కనిపించింది. ఇక హీరోయిన్ గా నటించిన సోనం బజ్వా గ్లామర్ షోతో అదరగొట్టేసింది. తన పాత్ర అంత ప్రాముఖ్యత కలిగి ఉన్నది కాకపోయినా ఉన్నంతలో స్కిన్ షోతో ఇంప్రెస్ చేసింది సోనం బజ్వా. ఇక 30 ఇయర్స్ పృధ్వి సీరియల్ డైరక్టర్ గా కాసేపు నవ్వులు పండించే ప్రయత్నం చేయగా.. బ్రహ్మానందం టైం మిషన్ కామెడీతో కితకితలు పెట్టించేలా చేశాడు. ఇక సపోర్టింగ్ రోల్స్ గా నటించిన మురళి శర్మ, ఆనంద్ లు ఓకే అనిపించుకోగా. విలన్ గా నటించిన శాంతారాం క్యారక్టర్ విలనిజం ప్రదర్శించడంలో విఫలమయ్యాడు. ఇక ఫ్రెండు ఫ్రెండు అనే మేనరిజంతో పోసాని మరోసారి తన మార్క్ కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.     

ఆటాడుకుందా రా.. చిత్రానికి ప్రధాన కారకుడు రచయిత శ్రీధర్ సీపాన. తను రాసుకున్న ఈ కథ జి.నాగేశ్వర్ రెడ్డి డైరెక్ట్ చేయడం జరిగింది. అయితే కథ కథనం అంతా పాత చింతకాయ పచ్చడిలానే ఉంటుంది. దర్శకుడు సినిమాను కొత్తగా నడిపించడంలో విఫలమయ్యాడు. ఇక సినిమాకు మ్యూజిక్ అందించినా అనూప్ కొంత మేరకు పర్వాలేదు అయితే సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కాస్త కొత్తగా ఉంది. ఇక కెమెరామన్ ధాశరథి శైలేంద్ర కెమెరామన్ తనం అంతగా మెప్పించలేదు. శ్రీ నాగ్ కార్పోరేషన్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. 

అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన సుశాంత్ అభిమానుల మనసు గెలుచుకునేందుకు ఆటాడుకుందాం రా అంటూ వచ్చాడు. శ్రీధర్ శీపాన రాసిన ఈ కథకు రొటీన్ స్క్రీన్ ప్లేతో డైరెక్ట్ చేసిన దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి సినిమాకు ప్రేక్షకులకు చేరువేయడంలో విఫలమయ్యాడు. సినిమా మొదలు పెట్టిన మూడ్ బాగా ఉంటుంది.. హీరో ఎంట్రీ కొన్ని కామెడీ సీన్స్ అంతా రొటీన్ గానే ఉన్నా పర్వాలేదనిపిస్తుంది.  


అయితే సెకండ్ హాఫ్ లో కథ ఎలా పొడిగించాలో తెలియక టైం మిషన్ కాన్సెప్ట్ బ్రహ్మిని బురిడి కొట్టించే ప్రయత్నం చేయడం ఇదంతా సోదిలా అనిపిస్తుంది. తన చెల్లి కొడుకుగా వచ్చిన కార్తిక్ తన స్నేహితుడు ఆనంద్ కొడుకు అని తెలిసిన సందర్భంలో ఇంకా సీన్స్ బాగా రాసుకుంటే బాగుండేది. 30 ఈయర్స్ పృధ్వి కామెడీ కొంతమేరకు ఓకే కాని అతన్ని ఇంకా వాడుకుంటే బాగుండేది అనిపిస్తుంది. 

కామెడీకి కావాల్సిన సందర్భం ఉన్నా వాటిని కూడా రొటీన్ కామెడీతో నింపేసినట్టు అనిపిస్తుంది. ఇక హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కన్నా హీరోయిన్ గ్లామర్ షో ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యింది. అనూప్ మ్యూజిక్ రెండు పాటలు ఓకే.. ఇక కథలో ప్రతి ఒక్కరిని బకరా చేసే హీరో క్యారక్టర్ గల సినిమాలు చాలానే చూశాం మరి ఇది కూడా ఆ కోవలో వచ్చిందే. కాస్త కొత్తగా ట్రై చేసి ఉంటే బాగుండేది కాని రొటీన్ గా ముగించేశారు.

సినిమాలో సడెన్ గా మెరిసిన అఖిల్, నాగచైతన్యల సర్ ప్రైజ్ స్క్రీనింగ్ ఫ్యాన్స్ కు హుశారు తెప్పిస్తుంది. సినిమాలో అక్కినేని ఫ్యామిలీని మొత్తం వాడేసిన దర్శకుడు సినిమాను మాత్రం ఆడియెన్స్ కు నచ్చేలా చేయలేకపోయాడు.  


Sushanth,Sonam Bajwa,Nageswara Reddy.G,Naga Suseela,Anup Rubens'ఆటాడుకుందాం రా..' అని సుశాంత్ ఆటలో ఓడిపోయాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: