రివ్యూ: తడాఖా

Star cast: Naga Chaitanya, Sunil, Tamannah, Andrea Jeremiah, Brahmanandam, Vennela Kishore, Raghu Babu

Director: Kishore Kumar Pardasani

Tadakha Reviews: Tweet Review | తెలుగు ట్వీట్ రివ్యూ | English Full Review


నాగచైతన్య, సునీల్ కలసినటించిన సినిమా ‘తడాఖా’. వీళ్లద్దరూ కలిసి నటించడంతో పాటు తమిళంలో విజయవంతమయ్యిన ‘వెట్టై’ ఆధారంగా ఈ సినిమా నిర్మించడంతో చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా అంచనాలను అందుకునే విధంగా ఉందా చూద్దాం..!

చిత్రకథ : తడాఖా

శివరామకృష్ణ [సునీల్], కార్తీక్ [నాగచైతన్య] అన్నదమ్ములు. అయితే శివరామకృష్ణ చిన్నతనం నుంచి భయస్తుడు. కార్తీక్ దెబ్బలు తినడానికైనా, దెబ్బలు కొట్టడానికైనా రెడీగా ఉంటాడు. తండ్రి మరణంతో వచ్చిన అవకాశంతో పోలీస్ డిపార్ట్ మెంట్ లో జాయిన్ అవుతాడు శివరామకృష్ణ. మరి భయస్తుడైన తన అన్నయ్య భయాన్ని కార్తీక్ ఏవిధంగా పొగొట్టాడు...., ఒక మంచి పోలీస్ అఫీసర్ గా ఏవిధంగా తీర్చిదిద్దాడు అనేది చిత్ర కథాంశం.

advertisements


నటీనటుల ప్రతిభ : తడాఖా

సునీల్ ఈ సినిమాలోని పాత్రకు సరిగ్గా ఒదిగిపోయాడు. ముందు భయస్తుడుగానూ, తరువాత ధైర్యవంతుడైన పోలీస్ అఫీసర్ గా చక్కని నటన కనబరిచాడు. ఏ పాత్రకు అయినా సరిపోయే నటుడు సునీల్ అని ఈ సినిమాతో అతను నిరూపించుకున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్యకు ప్రాముఖ్యత కల పాత్ర లభించింది. డాన్సులు, ఫైట్లు బాగానే చేసినా నాగచైతన్య డైలాగుల విషయంలో చాలా మెరుగుపడాలి. నటుడుగా రాణించడంలో డైలుగు చెప్పడం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. నాగచైతన్యకు ఇంకా ఈ కళ సరిగ్గా రాలేదని ఈ సినిమాలో చాలా సన్నివేశాల్లో అనిపిస్తుంది. తమన్నా పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. అయితే అందాల ప్రదర్శన బాగానే చేసింది. చిన్న పాత్ర అయినా ఆండ్రియా ఆకట్టుకుంటుంది. బ్రహ్మనందం, వెన్నెల కిషోర్ నవ్వించడానికి తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ ఆశించిన విధంగా ఆకట్టుకోలేక పోయారు. మిగిలిన వారు తమ పాత్రల పరిధిలో నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు : తడాఖా

ఫోటోగ్రఫీ బాగుంది. నేపధ్య సంగీతం సన్నివేశాలకు తగినట్లుగా ఉంది. బీచ్ సాంగ్, పెళ్లికి ఓకే ఓకే... పాటలు వినడానికి, చూడ్డానికి బాగున్నాయి. మాటలు అక్కడక్కడ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకత్వం విషయానికి వస్తే కథ కంటే, కథానానికే ఎక్కువ దృష్టి పెట్టాడు. ట్విస్ట్ లు లేకుండా ఒక సీన్ తరువాత ఒక సీన్ పేర్చుకుంటూ వెళ్లాడు. ఫార్మాలాను ఎక్కువగా నమ్ముకున్నాడు. అయితే సినిమాలో కథ గొప్పగా లేకపోవడం, ఆసక్తికరమైన సన్నివేశాలు లేకపోవడంతో సినిమా చూసేవారిని పెద్దగా మెప్పించదు.

హైలెట్స్ : తడాఖా

  • సునీల్ నటన,
  • తమన్నా అందాలు.

డ్రాబ్యాక్స్ : తడాఖా

  • కథ లేకపోవడం,
  • సన్నివేశాల్లో బలం లేకపోవడం,
  • నాగచైతన్య డైలాగ్ డెలవరి.

విశ్లేషణ : తడాఖా

తమిళంలో హిట్టయిన సినిమా అనగానే ‘తడాఖా’ పై అంచనాలు పెరిగాయి. సునీల్, నాగచైతన్య, తమన్నా, బెల్లంకొండ సురేష్ పేర్లు ఈ అంచనాలను మరింత పెంచాయి. అయితే ఈ సినిమా ఆ స్థాయిలో లేదు. నిజానికి ఈ సినిమా అన్నదమ్ముల కథకు సంబంధించిన సినిమా. అయితే ఇందులో అన్నదమ్ముల మధ్య సెంటిమెంట్ సీన్లు ఉండవు. కథ కూడా లేదు. అన్న పాత్రను కానీ, తమ్ముడు పాత్రను కానీ గొప్పగా చూపించే సీన్లు లేవు. స్రీన్ ప్లే, నటీనటుల ప్రతిభతో ఈ సినిమా తమిళంలో విజయవంతం అయి ఉండవచ్చు. నటులుగా నిరూపించుకున్నవారు చెయ్యాల్సిన సినిమా ఇది. అయితే నటుడు గా ఇంకా ఓనమాలు దశలోనే నాగచైతన్య ఈ సినిమాలో కీలక పాత్ర చేయడంతో ఈ సినిమా ఫలితం తెలుగులో నిరాశపరిచింది.

చివరగా :

నాగచైతన్య కెరియర్ విషయంపై నాగార్జున దిగులు ఇంకా కొనసాగుతుంది.

Review board: Cheruku Raja, Viswa Prasad, Shashikant.
Write to: editor@apherald.com; 
Call: +91-40-4260-1008
<

More Articles on Tadakha | Tadakha Wallpapers | Tadakha Videos

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: