చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి : రివ్యూ
Star cast: Tarun, Vimala Raman
Director: Kanmani
CACA Reviews: Tweet Review | తెలుగు ట్వీట్ రివ్యూ | English Full Review
చిత్రకథ :
ఇండియాలో పారిశ్రామిక వేత్త కుమారుడు సంజయ్(హీరో తరుణ్), జీవితమంటే ఎంజాయ్ చేయడం, భాద్యతారాహిత్యంగా ఉండడంతో అతనికి పెళ్లి చేస్థే మారుతాడని తల్లి భావిస్థుంది, పెళ్లి చేస్థే ఓ ఆడదాని జీవితం నాశనం చేసినట్లవుతుందని తండ్రి భావిస్థాడు. ఎంజాయ్ కోసం తల్లిదండ్రులను వదిలి బ్యాంకాక్ లో ఓటివి చానల్ లో యాంకర్ గా వారానికో గంట పనిచేస్థుంటాడు తరుణ్. ఈతరుణంలో సంజన( హీరోయిన్ విమలా రామన్) పరిచయం కావడం, ప్రేమలో పడడం జరిగిపోతుంది. వారిద్దరికి పెళ్లి అవుతుందా, తరుణ్ మారుతాడా అనేది వెండి తెరపై చూడాల్సిందే.
నటీనటుల ప్రతిభ :
హీరోగా తరుణ్ పాత్రకు తగ్గట్టుగా నటించలేక పోయాడు, రంగస్థల నాటకాల్లో డైలాగులు బట్టీ కొట్టి, బలవంతంగా నటింప చేస్థే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇక హీరోయిన్ విమలారామన్ ది సేమ్ టు సేమ్, సినిమా కదా నటించాలి కాబట్టి నటిస్థున్నాం అన్నట్లుగా ఉందే తప్ప పాత్రకు న్యాయం చేయలేదు. ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన బ్రహ్మానందం, దర్మవరపు సుబ్రమణ్యంలను ఉన్నప్పటికి వారిని సరిగా ఉపయోగించుకోలేదు. రెండు,మూడు సార్లు చూయించి వదిలేసారు. వారి పాత్రలు అనవసరం కాగా, నటన కూడా దానికి తగ్గట్టుగా చేయలేదు. పైగా వారికి ఇతరులతో డబ్బింగ్ చెప్పించడం మరీ ఘోరం
సాంకేతిక వర్గం పనితీరు :
డైరెక్షన్ సినిమాలో అస్సలు బాగాలేదు. కథేంటి దానిని నడిపించే క్రమం, సీన్లు అంతా టివీల్లో అయిదేళ్ల పాటు సాగే డైలి సీరియల్ కంటే దారుణంగా ఉన్నాయి. కథ ఏంటో కూడా తెలియకుండా, అసలు సినిమా ఏంటిదో కూడా అర్థం కాకుండా ఎప్పుడయిపోతుందా అన్నట్లుగా కథ, స్క్రీన్ ప్లే, కెమెరా ఉన్నాయి. పాటలు బాగా లేకపోగా, కనీసం కామెడి, ట్విస్టులు. ఎంటర్ టైన్ మెంట్ అనేవి ఏవిలేకుండా తీసి ప్రేక్షకులకు సినిమా అంటేనే ఏవగించుకునేలా ఉంది సినిమా.
హైలెట్స్ :
హైలెట్స్ లేవు
డ్రాబ్యాక్స్ :
సినిమా అంతా డ్రాబ్యాకే
విశ్లేషణ :
సినిమా అంటే ఇంత దారుణంగా ఉంటుందా అన్నట్లుగా ఉంది. ప్రేక్షకుడు మొదటి నుంచి చివరి దాకా సినిమా చూడలేని పరిస్థితి. సినిమా కామెడీనా, మాసా, కమర్షియలా. అసలు ఏంటో కూడా తెలియని పరిస్తితి. మంచి పాటలు లేవు, జోకులు లేవు, విలన్ లేడు, ఫైట్స్ లేవు, సినిమాలో ఏమవుతుందో అన్న ఆతృత లేదు. అసలు ఎందుకు, ఏఉద్దేశ్యంతో ఈసినిమా తీసారనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న.చివరగా :
ఇంత చెత్త సినిమా కూడా తీయగలరా అని అనిపిస్థుంది.Review board: Cheruku Raja, Viswa Prasad, Shashikant.
Write to: editor@apherald.com;
Call: +91-40-4260-1008