నేనే రాజు.. నేనే మంత్రి : రివ్యూ
తనకంటూ ఓ మంచి ఫ్యామిలీతో సంతోషంగా జీవితం గడుపుతున్న జోగేంద్ర అనుకోకుండా సర్పంచ్ తో జరిగిన గొడవ వల్ల తాను రాజకీయ నాయకుడిగా మారాలని ఆలోచన వస్తుంది. అక్కడి నుండి తన ఎత్తుగడలు మొదలవుతాయి. మొదట సర్పంచ్ ఆ తర్వాత ఎమ్మెల్యే ఎలా ఏకంగా ముఖ్యమంత్రికి కూడా చుక్కలు చూపించేస్తాడు. అయితే ఈ క్రమంలో తనకు శత్రువులు పెరిగిపోతారు. జోగేంద్ర భార్య రాధా (కాజల్) ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. తనకు నచ్చిన విధంగా చేసుకుంటూ వెళ్తున్న జోగేంద్రకు ఒకానిక దశలో అన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అసలు జోగేంద్ర ఎందుకు అలా మారుతాడు..? ఉరి తీసేంత తప్పు జోగేంద్ర ఏం చేశాడు..? ఫైనల్ గా కథ ఎలా ముగిసింది అన్నది తెర మీద చూడాలి.
జోగేంద్రగా రానా మరోసారి అదరగొట్టాడు. తన క్యారక్టరైజేషన్ విషయంలో దర్శకుడు తేజ ఎంత జాగ్రత్తపడ్డాడో దానికి నూటికి నూరు శాతం న్యాయం చేశాడు రానా. తన ఇంతకుముందు ఇమేజ్ మొత్తం జోగేంద్ర ముందు నిలవకలేకపోయాయి. ఇక రాధగా కాజల్ ఇంప్రెస్ చేయగా రిపోర్టర్ గా కేథరిన్ పరిధి మేరకు చేసింది. ఇక మిగతా పాత్రలన్ని సందర్భాన్ని బట్టి బాగా నటించి మెప్పించారు.
దర్శకుడు తేజ సినిమా మొదటి భాగం ఎంతో తెలివిగా నడిపించాడు. ఆడియెన్స్ అందరిని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇక సెకండ్ హాఫ్ మాత్రం నిరాశ పరచాడని చెప్పాలి. సినిమాటోగ్రఫీ బాగుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అదుర్స్.. ముఖ్యంగా నేపథ్య సంగీతం బాగుంటుంది. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ మీద ఇంకా దృష్టి పెట్టాల్సి ఉంది. సినిమాకు కావాల్సిన బడ్జెట్ ఇవ్వడం వల్ల రిచ్ గా అనిపిస్తుంది.